Malvika Mohanan : మాళవిక మోహనన్ కోసం బాలీవుడ్ క్యూ కట్టేస్తుందా?

Malvika Mohanan : మాళవిక మోహనన్ కోసం బాలీవుడ్ క్యూ కట్టేస్తుందా?
X

కోలీవుడ్ నటి మాళవిక మోహనన్ తెలుగులో నటించిన చిత్రాలే లేవు. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం సుపరిచమే ఈ ముద్దుగుమ్మ. ఎందుకంటా రా..? ఈ అమ్మడి డబ్బింగ్ సినిమాలను మనోళ్లు ఇప్పటికే చూసేశారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దశాబ్దం తర్వాత ప్రభాస్ సరసన రాజాసాబ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆ సినిమా తర్వాత మాళవిక మోహనన్ వరుసగా తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయ ని తెలుస్తోంది. ఒక వైపు రాజా సాబ్ చేస్తూనే మరో వైపు హిందీ సినిమా 'యుద్ర' లో నటించింది. సిద్దాంత్ చతుర్వేది హీరోగా రూపొందిన 'యుద్ర' సినిమా ఈ ఎల 20న థియేట్రికల్ రిలీజ్ కానుంది. యుద్ర మేకర్స్ ఇటీవలే ట్రైలర్ ను విడుదల చేశారు. ఇప్పటి వరకు మాళవిక మోహన్ చేసిన సినిమాల్లో కొన్ని సినిమాల్లో స్కిన్ షో చేసిన విషయం తెల్సిందే. అయితే యుద్ర సినిమాలో అంతకు మించి అన్నట్లుగా అందాలు ఆరబోసిం ది. ప్రస్తుతం నెట్టింట మాళవిక యుద్ర సినిమా అందాల స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. అందాల ఆరబోత మాత్రమే కాదండోయ్... హీరో సిద్దాంత్ తో రొమాంటిక్ సన్నివేశాలు, ముద్దు సన్నివేశాల్లో కూడా మాళవిక మోహనన్ నటించింది. ఆ సన్నివేశాలు సినిమా పై హిందీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నా యి. ఇప్పటి వరకు చేయని తరహా పాత్ర చేయడంతో పాటు, రొమాంటిక్ సన్ని వేశాల విషయంలో కూడా హద్దు దాటినట్లుగా నటించిన మాళవిక మోహనన్ కి యుద్ర హిట్ అయితే కచ్చితంగా బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చే అవ కాశాలు ఉన్నాయనే టాక్ స్టార్టయింది

Tags

Next Story