Pooja Hegde : త్వరలో బుట్టబొమ్మ పెళ్లి!?.. సోషల్ మీడియాలో వైరల్

Pooja Hegde : త్వరలో బుట్టబొమ్మ పెళ్లి!?.. సోషల్ మీడియాలో వైరల్
X

టాలీవుడ్ నటి పూజాహెగ్దే పెళ్లి పీటలెక్కబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 10 ఫేమ్, సీరియల్ యాక్టర్ రోహన్ మెహ్రతో పూజాహెగ్దే డేటింగ్ ఉన్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చాలా సార్లు అలా కెమెరాలకూ చిక్కిందీ అమ్మడు. ఈ జంట త్వరలోనే మూడు ముళ్ల బంధంలో ఒక్కటవబోతోందనే టాక్ నడుస్తోంది. అయితే వరుస ఫ్లాపులతో ఆందోళనలో పడ్డ ఈ భామకు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చిత్రంలో హీరోయిన్ గా అవకాశందక్కింది. ఈ సారిరెమ్యూనరేషన్ భారీగాతగ్గించిందని చెబుతున్నారు. కోలీవుడ్, బాలీవుడ్ లోఅవకాశాలు బాగానేవస్తున్నా తెలుగులోనైతేఒక్క సినిమాకూ బుట్టబొమ్మ సైన్ చేయలేదు.పెళ్లయ్యాక నటిస్తుందా..? లేదా..? అనే చర్చ కూడా మరో వైపు సాగుతోంది.

Tags

Next Story