Chiranjeevi : అనిల్ కు సరే.. విశ్వంభర పరిస్థితేంటో..?

ఈ వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి దూకుడుకు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోతోంది. అంటే ఆయన రజినీకాంత్ లాగా స్టడీ బ్లాక్స్ తో ఆగిపోడు కదా.. ఇప్పటికీ అదే జోష్ తో డ్యాన్స్ లు వేస్తున్నాడు. ఫైట్లు చేస్తున్నాడు. ఇక కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పేదేముందీ. ఆ దూకుడుతోనే త్వరలోనే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఆ మధ్య పెండింగ్ లో ఉన్న ‘విశ్వంభర’ మూవీ ఓపెనింగ్ సాంగ్ ను పూర్తి చేశాడు. తనకు సంబంధించి ఆ సినిమా వర్క్ అంతా అయిపోయింది. అయితే ఈ సినిమా విడుదల విషయమే ఎటూ తేలడం లేదు. బట్ మెగాస్టార్ మాత్రం దాంతో తనకు సంబంధం లేదేమో అన్నట్టుగా నెక్ట్స్ ప్రాజెక్ట్ కు రెడీ అవుతుండటం చూసి చాలామంది.. విశ్వంభర రిజల్ట్ ను ముందే ‘ఊహిస్తున్నారు’.
ఏ హీరో అయినా ఓ ప్రామిసింగ్ ప్రాజెక్ట్ గురించి అంత లైట్ గా తీసుకోడు. చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ ఆ మూవీ రిజల్ట్ ను ఎక్స్ పెక్ట్ చేయకుండా ఉంటాడా.. అందుకే ఈ మూవీని వదిలేసి అనిల్ రావిపూడి సినిమా కోసం ఎక్కువ టైమ్ కేటాయించబోతున్నాడు. పైగా ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 సంక్రాంతికి విడుదల చేయాలనే టార్గెట్ తో కదులుతున్నారు. అనిల్ స్టైల్లోనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఉంటుందనే టాక్ ఉంది. త్వరలోనే ఓపెనింగ్ తో పాటు ఇతర అంశాలకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వస్తుంది. అనిల్ చాలా వేగంగానే చిత్రీకరణ పూర్తి చేస్తాడు. పైగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో పెద్దగా పని ఉండదు. అందుకే ఈ మూవీ ఖచ్చితంగా వచ్చే సంక్రాంతికి విడదలవుతుందని చెప్పొచ్చు.
ఇక త్రిష, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా వంటి బ్యూటీస్ కూడా ఉన్న విశ్వంభర గురించి అప్డేట్స్ అస్సలేం రాకపోవడం ఆశ్చర్యం. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com