Chiranjeevi's Khaidi : మళ్లీ రగులుతోందా మొగలి పొద..?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పింది.. ఆయన్ని సుప్రీమ్ హీరోను చేసిందీ ఖైదీ మూవీ. ఖైదీ లేని చిరంజీవి కెరీర్ ను ఊహించలేం. ఎవరైనా తమ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావాలంటే అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఖైదీ లాంటి మూవీ పడాలి అనుకుంటారు. అదీ ఆ మూవీ రేంజ్. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందులోని రగులుతోంది మొగలిపొదా అనే పాట అంతకు మించి విజయం సాధించింది. నాటి యంగ్ స్టర్ గా చిరంజీవి, బ్యూటీఫుల్ మాధవితో కలిసి వేసిన స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఆ పాట కోసమే పదే పదే సినిమా చూసిన వాళ్లూ ఉన్నారు. అలాంటి పాటను రీమిక్స్ చేయాలనుకోవడం సాహసం. అదీ చిరంజీవితోనే అంటే ఆశ్చర్యం. యస్.. ఖైదీలోని రగులుతోంది మొగలిపొద పాటను విశ్వంభర కోసం రీమిక్స్ చేస్తున్నారు అనే న్యూస్ హల్చల్ చేస్తోంది.
విశ్వంభర ఎప్పుడో పూర్తయినా ఇప్పటికీ విడుదల డేట్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. అందుకు కారణం విఎఫ్ఎక్స్ సరిగా రాకపోవడమే అని అందరికీ తెలుసు. మరోసారి ఆ వర్క్ ను చేస్తున్నారు. ఈ లోగా సినిమాలోని కొంత ప్యాచ్ వర్క్ లతో పాటు ఓ స్పెషల్ సాంగ్ ను కూడా యాడ్ చేయబోతున్నారు. ఆ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ నటి మౌనీ రాయ్ నర్తించబోతోంది. తనకు ఇదే ఫస్ట్ తెలుగు సాంగ్ కావడం విశేషం. తనతో రగులుతోంది మొగలిపొద అనబోతున్నాడట మెగాస్టార్. కానీ ఈ పాటకు ఉన్న ప్రత్యేకతలే మెలికలు తిరుగుతూ చేసిన నాగుపాము డ్యాన్సులు. మరి ఈ వయసులో మెగాస్టార్ ఆ ఫీట్ ను రిపీట్ చేస్తాడా అంటే ఇంపాజిబుల్ అని చెప్పొచ్చు. అయినా ఇలాంటి పాటలను అలా వదిలేస్తేనే బెటర్. అనవసరంగా ఒరిజినల్ పై ఉన్న ఫీల్ పోతుంది.. రీమిక్స్ చేస్తే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com