Devara Davudi song : దేవర దావూదీ సాంగ్ పూర్తిగా తేలిపోయిందా..?
దేవర నుంచి థర్డ్ సింగిల్ అనౌన్స్ అయినప్పటి నుంచి చెప్పిన మాట ఈ పాటలో స్టెప్పులు అదిరిపోతాయి అని. బట్ సాంగ్ విడుదలైన తర్వాత చూస్తే అంతలేదు అని అనిపిస్తే తప్పేం లేదు. ఎన్టీఆర్ లాంటి టాప్ డ్యాన్సర్ విషయంలో అసలు అంచనాలు పెంచకూడదు. అతను ఈ స్టెప్ వేయలేడు అనే ప్రశ్నే లేనప్పుడు.. ఈ పాటలో అద్భుతమైన డ్యాన్స్ ఉంటుందని చెప్పడం అంచనాలను ఆకాశానికి పెంచడం.. బట్ వీళ్లు చూస్తే నేలను కూడా దాటలేదు అని సాంగ్ చూశాక అర్థం అయింది.. ఇదీ ఇప్పుడు అభిమానుల ఆవేదన. నాన్నకు ప్రేమతో, టెంపర్ లాంటి మూవీస్ లో అతని స్టెప్పులు.. అంతకు ముందు యమదొంగ ఫస్ట్ సాంగ్ లో అతను చించేసిన విధానం వీటికి మించి ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తే నీరసమైన అనిరుధ్ మ్యూజిక్ లో అదే పనిగా ఊగుతూ నాన్ స్టాప్ గా ‘జస్ట్ డ్యాన్స్’ చేశాడు అంతే. నిజానికి ఎన్టీఆర్ రేంజ్ కు ఇదేమంత డ్యాన్సే కాదు. అలాంటిది వీరు అంచనాలు పెంచి మరీ బిల్డప్ ఇవ్వడం మొత్తానికే మోసం చేసింది.
రామజోగయ్య శాస్త్రి సాహిత్యం బావుంది. కానీ దాన్ని సంగీతం మింగేసింది. నకాష్ అజీజ్ గొంతు అస్సలు నప్పలేదు. ఎలా చూసినా ఈ పాట మేకర్స్ ఇచ్చిన బిల్డప్ కు ఆడియన్స్ లో ఉన్న హైప్ కు అస్సలు మ్యాచ్ కాలేదు. ఇలా డైరెక్ట్ గా అంటే అభిమానులకు కోపం వస్తుందేమో కానీ.. వాళ్ల ఒరిజినల్ ఫీలింగ్ కూడా అదే అయి ఉంటుంది. ఇక ఇంతకు ముందు వచ్చిన రెండు పాటలూ సినిమాపై అంచనాలు పెంచలేదు. ఇదీ అలాగే కనిపిస్తోంది. సో.. ఓ రకంగా దేవర రిజల్ట్ కూడా ఇన్ డైరెక్ట్ గా అర్థం అవుతోందని యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ కమెంట్స్ చేస్తున్నారు. వీటికి గట్టిగా ఖండించాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కూడా సరైన విషయం కనిపించడం లేదు.
సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. అనిరుధ్ తెలుగు సినిమాలకు సంగీతం అందించడానికి పనికి రాడు అనేది మరోసారి క్లియర్ గా అర్థం అయింది. పాటలు ఇలా ఉన్నాయి.. మరి నేపథ్య సంగీతం అయినా అతని స్థాయికి తగ్గట్టుగా ఉంటుందో లేదో. లేదు అంటే ఇంక చెప్పేదేముందీ.. దేవర.. సముద్రంలో కలిసిపోతుందంతే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com