Dil Raju : దిల్ రాజు మెగా ఫ్యాన్స్ ను కెలుకుతున్నాడా..?

ఏ ఇండస్ట్రీలో అయినా గెలుపు, ఓటమి కామన్. హిట్స్ ఉంటాయి, ఫ్లాపులూ ఉంటాయి. ఈ రెంటినీ ఫేస్ చేయడమే పెద్ద టాస్క్. ఆ టాస్క్ లోని టఫ్ నెస్ ను ఈజీగా ఫేస్ చేయగల సత్తా ఉన్న నిర్మాత దిల్ రాజు. కానీ ఈ మధ్య దిల్ రాజు చెబుతోన్న మాటలు కొంత ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన నిర్మించిన తమ్ముడు సినిమా ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ అతను తమ్ముడు గురించి కంటే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ గురించి ఎక్కవగా మాట్లాడుతున్నాడు. ఆయన సోదరుడు శిరీష్ సైతం అదే చెబుతున్నాడు. గేమ్ ఛేంజర్ తెచ్చిన నష్టాలు భయపెట్టాయంటున్నారు. సినిమా తర్వాత కనీసం హీరో ఒక్క ఫోన్ కూడా చేయలేదని, మెసేజ్ కూడా పెట్టలేదని ఫీల్ అవుతున్నారు. అయితే సినిమా పోతుందని ముందే అర్థమైంది అని కూడా చెబుతండటం గమనార్హం. అంటే పోయే సినిమా హీరోకు మాత్రం అర్థం కాదా..? అతనికీ ఈ నిర్మాత తనకు మంచి సినిమా ఇవ్వలేదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా.. పైగా ఆ దర్శకుడు ఎవరి మాటా వినని సీతయ్య లాంటోడు అని కూడా అందరికీ తెలుసు కదా..? ఇవన్నీ తెలిసి కూడా ఇప్పుడు పదే పదే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ డీ గ్రేడ్ చేస్తూ మాట్లాడటం మాత్రం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి సినిమాల బిజినెస్ విషయాల్లో దిల్ రాజు క్లియర్ గానే ఉంటాడు. అయినా గేమ్ ఛేంజర్ గురించి అదే పనిగా చెబుతూ ఉండటం చూస్తుంటే మెగా ఫ్యాన్స్ ను కావాలనే కెలుకుతున్నారా అనిపిస్తే ఆశ్చర్యమేం లేదు.
ఇక సంక్రాంతికి వస్తున్నాం లేకపోతే మా జీవితం ఏమయ్యేదో ఊహించుకుంటేనే భయం వేసింది అంటూ ఎప్పుడో కానీ మాట్లాడని శిరీష్ సైతం ఆ సినిమా గురించి పదేపదే చెబుతుండటం చూస్తుంటే వీరి మైండ్ లో ఇంకేదో ఉన్నట్టు అర్థం చేసుకుంటున్నారు కొందరు. అది ఏంటీ అనేది అప్రస్తుతం అయినా.. తమ్ముడు మూవీ గురించి ప్రమోషన్స చేసుకుంటే బావుంటుంది కానీ.. ఆల్రెడీ ఆరు నెలలైన తర్వాత పోయిన సినిమా గురించి మాట్లాడటం ఇండస్ట్రీలోనూ చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com