Kiran Abbavaram : కిరణ్ కెపాసిటీకి దిల్ రుబా తేల్చేస్తుందా..?

Kiran Abbavaram :  కిరణ్ కెపాసిటీకి దిల్ రుబా తేల్చేస్తుందా..?
X

కిరణ్ అబ్బవరం.. ‘క’ మూవీకి ముందు తర్వాత అన్నట్టుగా మారిపోతాడా లేక క మూవీకి ముందులానే ఉంటాడా అనేది తేల్చే సినిమా దిల్ రుబా అవుతుందా.. అంటే అవును అనే చెబుతున్నారు. కిరణ్ అంతకు ముందు చేసిన సినిమాలు ఎన్ని ఉన్నా.. క తర్వాత కథల ఎంపికలో మార్పులు వచ్చాయి అంటున్నారు. కానీ దిల్ రుబా ‘క’ కంటే ముందే ఒప్పుకున్న సినిమా. ‘క’ కథ ఎక్కువ నచ్చడంతో ఈ దిల్ రుబాను పక్కన పెట్టి ఆ సినిమా పూర్తి చేసిన లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ‘క’ కంటెంట్ పరంగా బలమైన కథ కాకపోయినా కథనంతో మాయ చేశారు. చివరి పావుగంట సినిమా మిగతా సినిమాను నిలబెట్టింది. అందుకే అంత పెద్ద విజయం సాధించింది.

బట్ దిల్ రుబా అలా కాదు. ఇదో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. అఫ్ కోర్స్ ఇప్పటి వరకూ వచ్చిన పాటలు, టీజర్ ఆకట్టుకున్నాయి. ప్రామిసింగ్ లానే కనిపిస్తున్నాయి. కానీ సినిమా వస్తే కానీ ఏదీ తేల్చలేం. అదే టైమ్ లో ఈ గురువారం సాయంత్రం రాబోతోన్న ట్రైలర్ లో దిల్ రుబా దమ్మేంటో అంచనా వేసే అవకాశం ఉంది. అలా చూసినా ట్రైలర్ అద్భుతం అనిపించుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

ఏదైనా ‘క’మూవీ టైమ్ లో కిరణ్ అబ్బవరం తన సినిమాలు చాలా హిట్ అయ్యాయని చెప్పుకున్నాడు. కొంత ఎమోషనల్ గానూ మాట్లాడాడు. అప్పుడు సింపతీ వచ్చింది. చాలామంది అతనికి సపోర్ట్ చేశారు. సినిమా కూడా బావుండటంతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నుంచే కిరణ్ లో రెట్టించిన కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఆ కాన్ఫిడెన్స్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది దిల్ రుబా రిజల్ట్ తేల్చేస్తుంది.

Tags

Next Story