Game Changer : గేమ్ ఛేంజర్ కు ఆ రికార్డ్ కష్టమే

స్టార్ హీరోల సినిమాలంటే మొదటి ఆట పడిన దగ్గర నుంచీ రికార్డులు లెక్కలు వేస్తుంటారు. ఆల్రెడీ రికార్డులు కొట్టిన హీరోల ఫ్యాన్స్ కొత్తగా వస్తోన్న సినిమాల గురించి ఎదురు చూస్తుంటారు. తమ హీరో రికార్డులు దాటితే కామ్ గా ఉంటారు. లేదంటే మావోడే గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. కొన్నాళ్లుగా డే ఒన్ కలెక్షన్స్ రికార్డ్ అనేది క్రియేట్ అయింది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ రాజమౌళి, ప్రభాస్ లాంటి వాళ్లు వస్తే తప్ప వాల్డ్ వైడ్ గా మొదటి రోజు వసూళ్ల రికార్డులు బద్ధలు కొట్టడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఈ రికార్డు పుష్ప 2కు ఉంది. తెలుగులో కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ పుష్ప 2 పేరిటే ఉండటం విశేషం. దీంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ ఆ రికార్డ్ ను దాటుతుందా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. బట్ అది అసాధ్యం అనే చెప్పాలి.
నిజానికి పుష్ప 2కు ఇచ్చిన టికెట్ రేట్లు, అదనపు ఆటలకు పర్మిషన్స్, బెన్ ఫిట్ షో, రిలీజ్ కు ముందు రోజు రాత్రే ఫస్ట్ షో పడటం.. ఇలా ఎన్నో అంశాలు కలిసొచ్చాయి. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 63.29కోట్లు వసూళ్లు సాధించి నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత స్థానంలో ఉన్న మూవీ దేవర. ఈ చిత్రం కూడా 54.08 కోట్లు తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే కలెక్ట్ చేసింది. ఈ మూవీకి కూడా టికెట్ రేట్లు రెండు రాష్ట్రాల్లోనూ పెంచారు. బెన్ ఫిట్ షో ఉంది. థర్డ్ ప్లేస్ లో ప్రభాస్ కల్కి ఉంది. కల్కి తెలుగు స్టేట్స్ లో 38.09 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికీ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు.
బట్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే టికెట్ ధరలు పెంచారు. కానీ తెలంగాణలో బెన్ ఫిట్ షో లేదు. అదనపు ఆటలూ లేవు. అంటే కేవలం ఒక్క రాష్ట్రంలోనే రికార్డ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ స్టేట్ తో పుష్ప 2నే కాదు.. దేవర కలెక్షన్లను దాటడం కూడా కష్టం. సో.. అసలు గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అనే ప్రశ్నే వేస్ట్. ఇంక పుష్ప 2ను దాటుతుందా అని అడగడం అవివేకం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com