Anushka Shetty : ఘాటీ.. స్వీటీకి హిట్ ఇస్తుందా..?

అనుష్క.. బాహుబలి వరకూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత చేసిన భాగమతి బ్లాక్ బస్టర్. అంతకు ముందే చేసిన సైజ్ జీరో మూవీ తన కెరీర్ కే శాపంగా మారింది. ఈ సినిమా కోసం బరువు పెరిగింది. తిరిగి తగ్గించడంలో తను ఫెయిల్ అయింది. బాగా చబ్బీగా మారింది. దీంతో రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకు సెట్ కాకుండా పోయింది. అయినా నిశ్శబ్ధం అనే ఓటిటి మూవీతో ఆకట్టుకోవాలనుకుంది. బట్ అది పోయింది. లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో కొంత అలరించింది. ఇక ఇప్పుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీతో రాబోతోంది.
ఆంధ్రా, ఒరిస్సా బార్డర్స్ లో ఉన్న ఘాటీల్లో నివసించే ట్రైబ్స్ కు చెందిన యువతిగా అనుష్క కనిపించబోతోంది. ఆ గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారితోనే గంజాయి పండిస్తారు కొందరు వ్యాపారస్తులు. అంతేకాక ఆ కొండల నుంచి ఆ గంజాయిని చేరవేసేది కూడా వారే. ఆ పనిచేసే శీలావతి అనే పాత్రలోనే అనుష్క కనిపించబోతోంది. అయితే గంజాయి వల్ల నష్టాలు తెలుసుకుని.. ఆ వ్యాపారస్తులకు సహకరించకూడదు అని భావిస్తుంది. వాళ్లు బెదిరిస్తారు. తను ఎదురిస్తుంది. ఈ క్రమంలో సాగే కథే ఈ సినిమా అని ట్రైలర్ తోనే చెప్పేశారు. ప్రమోషన్స్ లోనూ అదే మాట అంటున్నారు. ఈ పాత్రలో అనుష్క చాలా పవర్ ఫుల్ గా ఉంటుందనేది క్రిష్ చెబుతున్న మాట.
ఓ రకంగా అనుష్కకు ఇది లిట్మస్ టెస్ట్ లాంటి మూవీ. విజయం సాధిస్తే మరిన్ని లేడీ ఓరియంటెడ్ కథలు వస్తాయి. లేదంటే తన కెరీర్ క్లైమాక్స్ ను చేరుకున్నట్టుగానే భావించాలి. అయితే ఘాటీలో నటనకు ఆమెకు అవార్డులు వస్తాయంటున్నారు. కానీ ఇవాళా రేపు కమర్షియల్ వయబిలిటీయే ముఖ్యంగా. అది లేకుండా అవార్డులు వస్తే ఆర్టిస్టలకు ప్లస్ అవుతుంది. కానీ నిర్మాతలు కూడా ఖుషీ అయితేనే అనుష్కకు నెక్ట్స్ మూవీ ఉంటుంది. ఓ రకంగా నయనతారలా మెయిన్టేన్ చేయాలంటే ఈ మూవీతో సూపర్ హిట్ కొట్టాలి. కానీ కథంతా ట్రైలర్ లోనే చెప్పడం ఇప్పటికి కొంత మైనస్ లా కనిపిస్తోంది. అలాగే.. అనుష్క ప్రమోషన్స్ కు రాకపోవడం, మిగిలిన ఆర్టిస్టులెవరూ పెద్దగా తెలిసిన వారు కాకపోవడం మరో మైనస్. క్రిష్ ఒక్కడే ప్రమోషన్ బండి లాగుతున్నాడు. మరి ఈ బండి విజయం వరకూ వెళుతుందా లేదా అనేది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com