Sivakarthikeyan : కోలీవుడ్ నెక్ట్స్ సూపర్ స్టార్ ఇతనేనా

Sivakarthikeyan :  కోలీవుడ్ నెక్ట్స్ సూపర్ స్టార్ ఇతనేనా
X

తమిళ సినిమా పరిశ్రమలో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. బట్ రజినీకాంత్ తర్వాత ఆ స్థానం ఎవరిదీ అంటే అంతా విజయ్ పేరే చెప్పారు. ఆ తర్వాత అజిత్ నిలిచాడు. కానీ ఈ ఇద్దరిలో ఫ్యాన్ బేస్, సక్సెస్ రేట్, ఇంకా ఇతర అంశాలతో పోలిస్తే విజయ్ ఎప్పుడూ అప్పర్ హ్యాండ్ గానే ఉంటాడు. అయితే అతను సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. చివరగా ఇప్పుడు చేస్తోన్న జన నాయకన్ చివరి చిత్రంగా చెప్పేశాడు. తర్వాత అజిత్ ఆ స్థానంలోకి వస్తాడా అంటే ఖచ్చితంగా కష్టం అని చెప్పొచ్చు. మరి కోలీవుడ్ కు కాబోయే నెక్ట్స్ సూపర్ స్టార్ ఎవరూ అంటే అంతా ఇప్పుడు శివకార్తికేయన్ వైపు చూపిస్తున్నారు. అతని స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా ఇంతకు ముందు కంటే ఇప్పుడు వైవిధ్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ మూవీస్ తో మాస్ లో బేస్ పెంచుకుంటున్నాడు. దీనికి తోడు విజయ్ ఫ్యాన్స్ మాగ్జిమం ఇప్పుడు శివకార్తికేయన్ కే సపోర్ట్ చేస్తున్నారు.

2024లో శివకార్తికేయన్ చేసిన అమరన్ 350 కోట్లు కలెక్ట్ చేసి విజయ్ గోట్ తర్వాతి స్థానంలో నిలిచింది. గోట్ లోనే విజయ్ తన తుపాకీని కేమియో రోల్ చేసిన శివకార్తికేయన్ చేతిలో పెడతాడు. దీన్ని అప్పట్లోనే తన ఇమేజ్ ను నీకు ఇస్తున్నాను అనేలా సింబాలిక్ షాట్ లా చూపించాడు అని విశ్లేషించారు కొందరు. అయితే అమరన్ బిగ్గెస్ట్ హిట్ కావడం.. ఇప్పుడు అతని లైనప్ చూస్తే మరిన్ని బ్లాక్ బస్టర్స్ ఖాయం అన్నట్టుగా ఉండటం చూస్తుంటే రాబోయే రోజుల్లో కోలీవుడ్ కు కాబోయే సూపర్ స్టార్ ఇతనే అంటున్నారు.

ప్రస్తుతం శివకార్తికేయన్ పరాశక్తి అనే చిత్రంతో పాటు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో ‘మదరాసి’అనే చిత్రాలు చేస్తున్నాుడు. ఆ మధ్య విడుదలైన పరాశక్తి టైటిల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ శివకార్తికేయన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన మదరాసి టైటిల్ టీజర్ చూసినా అదే ఫీలింగ్. పరాశక్తి కంటే మదరాసి టీజర్ మరింత పవర్ ఫుల్ గా ఉంది. ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. దీన్నే కొందరు కోలీవుడ్ పీపుల్.. అప్పట్లో ఈ దర్శకుడు విజయ్ కి కత్తి వంటి సోషల్ అవేర్ నెస్ తో కూడిన మాస్ మూవీతో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇది శివకార్తికేయన్ కు ఇస్తోన్న ‘కత్తి’అంటున్నారు.

ప్రస్తుతం కోలీవుడ్ లో అజిత్ కెరీర్ మంద్రంగా సాగుతోంది. అతనికీ ఈ సూపర్ స్టార్ అనిపించుకోవాలన్న ఆరాటాలేం లేవు. రజినీకాంత్, కమల్ హాసన్ లెజెండ్స్ గా ఫిక్స్ అయిపోయారు. ఇక తర్వాత రేస్ లో ఉన్న సూర్య, విక్రమ్, కార్తీ, ధనుష్, శింబు వంటి వారికి ఈ ఇమేజ్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. సో.. శివకార్తికేయన్ కు ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎటొచ్చీ.. ప్రతి యేడూ ఒక్క బ్లాక్ బస్టర్ అయినా ఇస్తూ పోతే రాబోయే ఐదారేళ్లలోనే అతనో సూపర్ స్టార్ అవుతాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Tags

Next Story