Puri Jagannadh : డబుల్ డిజాస్టర్ అయినట్టేనా ..?

Puri Jagannadh :  డబుల్ డిజాస్టర్ అయినట్టేనా ..?

ఫస్ట్ డే టాక్ ను బట్టి ఎక్స్ పెక్ట్ చేసిందే అయ్యింది. లైగర్ తో ఆల్ టైమ్ డిజాస్టర్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ ఆ రికార్డ్ ను వేరే వారు తీసుకోకుండా జాగ్రత్త పడినట్టుగానే ఈ డబుల్ ఇస్మార్ట్ తో వచ్చాడు. రిలీజ్ కు ముందు కాస్త హైప్ చూసి ఏమో.. హిట్టు కొట్టేసినా ఆశ్చర్యం లేదు అనుకున్నారు. అందుకు కారణం హీరోయిన్లపై అతని పైత్యం కాస్తైనా తగ్గుతుందేమో అని. అలాగే ఈ సారైనా కాస్త కొత్త కథ, కథనంతో వస్తాడేమో అని అలా భావించారు. బట్ పూరీకి అలాంటివేం అక్కర్లేదు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అదే రొడ్డకొట్టుడు హీరో ఎలివేషన్స్, ఓవర్ యాటిట్యూడ్ డైలాగ్స్, హీరోయిన్లను చీప్ గా చూపించడం.. దీనికి మించి అసహ్యాన్ని కలిగించేలాంటి అలీ ట్రాక్.. వెరసి జనం మొదటి ఆటతోనే ఛీ కొట్టారు ఈ మూవీని.

నిజంగా అలీ ట్రాక్ చూస్తే పూరీ జగన్నాథ్ పై జాలి కలుగుతుంది. ఇతనే కదా.. కొన్నాళ్ల క్రితం టెంపర్ తీసి అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని అబ్బో అదే పనిగా సొసైటీ, న్యాయ వ్యవస్థపై సెటైర్ వేసింది. అంతలోనే ఇలాంటి చీప్ ట్రాక్ తో వస్తే.. జనం ఏం అనుకోరు అనుకున్నాడేమో.. బట్ జనం పట్టించుకుంటారు. అసలా మాటకొస్తే బద్రి నుంచి హీరోయిన్ల విషయంలో పూరీ ఆలోచనలు ఎప్పుడూ వక్రంగానే ఉంటాయి. వారికంటూ సొంత వ్యక్తిత్వం ఉండదు. ఆవారా అయిన హీరోలనే ఆరాధించేలా ఆ పాత్రలను మలచాడు. ఆ పాత్రలకు మినిమం సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా చూసుకుంటాడు. ఓ రకంగా ఆడవారిపై అతని సొంత ఆలోచనలే అతని కథల్లో ప్రతిబింబిస్తాయేమో అనే డౌట్ వస్తే అతిశయోక్తేం కాదు. మొత్తంగా పూరీ జగన్నాథ్ దర్శకుడుగా ఇంక పనికిరాడు అనే ఫీలింగ్ అందిరిలోనూ వినిపిస్తోంది. అందుకే ఈ డబుల్ ఇస్మార్ట్ డబుల్ డిజాస్టర్ గా మారబోతోందని రోజు రోజుకూ తగ్గుతున్న షోస్, ఉన్న షోస్ కు కూడా జనం కనిపించకపోవడం చూస్తుంటే అర్థం అవుతుంది కదా.

Tags

Next Story