Viswak Sen : 'నందమూరి కాంపౌండ్' ముద్రను చెరిపే ప్రయత్నమా..?

విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా 'లైలా'. రామ్ నారాయన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్. సాహు గారపాటి నిర్మిస్తున్న చిత్రం ఇది. లైలాపై ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా ఆకట్టుకుంది. టీజర్ సూపర్బ్ అనిపించుకుంటే.. ట్రైలర్ తో ఓ హిలేరియస్ ఎంటర్టైనర్ చూడబోతున్నాం అనే ఫీల్ వచ్చింది. పాటలు కూడా ఓకే అనేలా ఉన్నాయి. ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ఈ మధ్య విశ్వక్ సేన్ మూవీస్ అన్నీ రిలీజ్ కు ముందు ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నాయి కానీ.. రిజల్ట్ మాత్రం తేడా కొడుతోంది. లాస్ట్ ఇయర్ వచ్చిన గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ మూడు చిత్రాలూ కమర్షియల్ గా నిరాశపరిచాయి.బట్ ఈ మూవీస్ ప్రమోషనల్ కంటెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కాకపోతే ఈ సారి ఆ రిజల్ట్ కాకుండా తాము అనుకుంటోన్న రిజల్ట్ వస్తుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు విశ్వక్ సేన్.
ఇక ఈ ఆదివారం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కొన్నాళ్లుగా విశ్వక్ సేన్ ఎన్టీఆర్, బాలకృష్ణలతో క్లోజ్ గా ఉంటున్నాడు. దీంతో అతను నందమూరి క్యాంప్ కు చెందిన వాడనే ముద్ర పడుతోంది. ఇదే విషయం రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ లో అడిగితే ఇండస్ట్రీలో ఏ కాంపౌండ్ లూ లేవు అందరం ఒకటే అన్నాడు. పైగా చిరంజీవికి తన తండ్రికి మధ్య మంచి రిలేషన్ ఉందని.. చిరంజీవి పార్టీ నుంచి తన తండ్రి మలక్ పేట్ నుంచి పోటీ చేశాడనీ.. ఆయనెప్పుడూ నాకు వెల్ విషర్ అన్నాడు. అయితే నిజంగానే విశ్వక్ పై నందమూరి కాంపౌండ్ పై డిపెండ్ అవుతున్నాడు అనే కామెంట్స్ ఉన్నాయి. వాటిని చెరపడానికే ఇప్పుడు మెగాస్టార్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పిలిచారు అనే వాదన మళ్లీ కొత్తగా వినిపిస్తోంది.
మరోవైపు నిర్మాత సాహు గారపాటితో చిరంజీవి నెక్ట్స్ మూవీ ఉంది. అందుకే తన నిర్మాత కోసం మెగాస్టార్ వస్తున్నాడు అనేవాళ్లూ ఉన్నారు. ఏదేమైనా మెగాస్టార్ ఎంట్రీ లైలాకు పెద్ద ప్లస్ అవుతుందనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com