Suriya : కంగువాపై ఇది నమ్మకమా.. బిల్డప్పా ..
తమిళ్ స్టార్ హీరో సూర్య మూవీ గురించి ప్రొడ్యూసర్ చెబుతోన్న కొన్ని మాటలు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. తన సినిమాపై నమ్మకంతో చెబుతున్నాడా లేక మూవీ గురంచి బిల్డ్ అప్ ఇస్తున్నాడా అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. కంగువా మూవీ సూర్య కెరీర్ లోనే హై బడ్జెట్ మూవీ. ఇప్పటి వరకూ కమర్షియల్ మూవీస్ తో టాప్ డైరెక్టర్ గా మారిన శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సోషియో ఫాంటసీలానూ, ఫిక్షన్ లానూ కనిపిస్తోన్న కంగువా జానర్ ఇదీ అని ఇప్పటి వరకూ ఎవరూ ఓ అంచనాకు రాలేకపోతున్నారు. అంటే ఓ రకంగా మూవీ టీమ్ తమ సినిమా గురించి జనం రకరకాలుగా మాట్లాడుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి. సూర్య సరసన దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోన్న కంగువాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం చేస్తున్నాడు.
అక్టోబర్ 10న దసరా సందర్భంగా విడుదల కాబోతోంది కంగువా.అయితే ఇదే టైమ్ కు కొన్ని తమిళ్ మూవీస్ కూడా ఉన్నాయి. దీంతో తమ సినిమాకు పోటీ పెరుగుతోందని నిర్మాత జ్ఞానవేల్ రాజాకు అనిపించిందో లేక.. నిజంగానే సినిమాలో అతను చెప్పినంత పెద్ద విషయం ఉందో కానీ.. లేటెస్ట్ గా తమిళ్ లో ఒక ఇంటర్వ్యూ లో జ్ఞానవేల్ రాజా చెప్పిన మాటలు అక్కడ వైరల్ గా మారాయి. మరి అతనేమన్నాడో తెలుసా.. ‘ కంగువా సినిమా రేంజ్ గురించి తెలియక చాలామంది పోటీగా విడుదల చేస్తున్నారు. కానీ ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ కు పోటీగా రావాలని ఆలోచించడానికి కూడా భయపడతారు..’.. ఇదీ జ్ఞానవేల్ రాజా చెప్పిన మాటలు. ఓ రకంగా తన సినిమాపై ఇది అతని కాన్ఫిడెన్స్ కావొచ్చు. కానీ అంతే కాన్ఫిడెన్స్ మరో సినిమా తీసిన మరో నిర్మాత లేదా దర్శకుడికి కూడా ఉంటుంది కదా.. వాళ్లూ అదే అనుకుని పోటీగా వాళ్ల సినిమాలు రిలీజ్ చేసి కంగువాపై పై చేయి సాధిస్తే ఏం చేస్తారు అంటూ సెటైర్స్ వేస్తున్నారు. మొత్తంగా మూవీ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి జ్ఞానవేల్ రాజాది ఇప్పటి వరకైతే కాన్ఫిడెన్స్ అనే అనుకుందాం. రిలీజ్ తర్వాత అతని కాన్ఫిడెన్స్ ఫలిస్తుందా లేక ఇదంతా బిల్డప్పా అనేది తెలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com