Narne Nithin : ఎన్టీఆర్ బావమరిది సెట్ అయినట్టేనా..

నెపోటిజం గురించి ఎవరెన్ని చెప్పినా ఇండస్ట్రీలో నిలబెట్టేది టాలెంటే అనేది అన్ని పరిశ్రమల్లోనూ ప్రూవ్ అయింది. నెపో కిడ్ అని చెప్పలేం కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నార్నే నితిన్. ఫస్ట్ మూవీ శ్రీశ్రీశ్రీ రాజావారు. బట్ ఈ మూవీ ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఆ లోగా 2023లో మ్యాడ్ మూవీ వచ్చింది. సూపర్ హిట్ అయింది. నలుగురులో ఒకడుగా కనిపించాడు నితిన్. సినిమా హిట్ అయింది, పైగా ఆ టీమ్ లో అందరికంటే ఎక్కువమందికి తెలిసిన వాడుగా నార్నే నితిన్ కాస్త ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 2024లో ఆయ్ మూవీతో మరో హిట్ అందుకున్నాడు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ అతనికి సపోర్ట్ కాస్టింగ్ బాగా కలిసొచ్చింది. ఆయ్ రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య చేసిన కామెడీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆ మధ్యలో కనిపించిన లవ్ స్టోరీ ఆకట్టుకుంది. నేటివిటీ, నేచర్ కూడా కలిసొచ్చింది. ఆయ్ కమర్షియల్ గా మంచి విజయమే సాధించింది.
ఇక ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ తో మరో హిట్ పడింది. అంటే ఓ రకంగా హ్యాట్రిక్ కొట్టినట్టే కదా. కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ అంటే చిన్న విషయం కాదు. అలాగని నార్నే నితిన్ విషయంలో పెద్ద విషయం కూడా కాదు అనే చెప్పాలి.
నితిన్ కు విజయాలున్నాయి. కానీ అందులో అతని షేర్ పైనే చాలా ప్రశ్నలున్నాయి. మ్యాడ్ రెండు భాగాల్లోనూ అతని పాత్ర పెద్ద ప్రభావవంతంగా కనిపించదు. ముఖ్యంగా ఆ నలుగురులో వీక్ టైమింగ్ ఉన్న నటుడు అతనే. డైలాగ్ డెలివరీ అయితే అసలు స్పష్టంగానే లేదు. కొన్ని అక్షరాలు కూడా పలకలేకపోతున్నాడు. ఎక్స్ ప్రెషన్స్ పరంగా ఇంకా చాలా చాలా ఇంప్రూవ్ కావాలి. మ్యాడ్ స్క్వేర్ లో చూస్తే అతను ఎన్టీఆర్ బావమరిది కాబట్టే క్లైమాక్స్ ట్విస్ట్ పెట్టారా అనే డౌట్ కూడా వస్తుంది. ఆ ట్విస్ట్ లో అతను కనిపించడం ఫోర్స్ డ్ గానే ఉంది తప్ప నేచురల్ గా లేదు. ఒకవేళ కళ్యాణ్ శంకర్ మరో పార్ట్ తీస్తే అతని కోసమే సీరియస్ గా తీయాలా లేక సిబిఐని కూడా ఇలా సిల్లీ కామెడీతో నింపేస్తాడా అనేది చూడాలి. ఏదేమైనా నార్నే నితిన్ కు హిట్స్ వచ్చాయి అనే కంటే హిట్ కథల్లో అతనూ ఉన్నాడనే చెప్పాలి. అందుకే తను సోలోగా మరింత ప్రూవ్ చేసుకుంటే తప్ప ఈ క్రెడిట్ పెరగదు. అలా ప్రూవ్ చేసుకునేటప్పుడైనా.. డిక్షన్ తో పాటు ఎక్స్ ప్రెషన్స్ పైనా మరింత శ్రద్ధ పెట్టాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com