Rajinikanth : జైలర్ 2కు భారతీయుడు 2ను పోలికనా ..?

Rajinikanth :  జైలర్ 2కు భారతీయుడు 2ను పోలికనా ..?
X

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏజ్ లో కూడా ఓ రేంజ్ లో దూకుడు చూపిస్తున్నాడు. యంగ్ స్టర్స్ కూ సాధ్యం కాని స్థాయిలో యేడాదికి కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. 2023లో వచ్చిన జైలర్ తో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. బట్ ఆ తర్వాత వచ్చిన వేట్టయాన్ కాస్త నిరాశపరిచింది. అయినా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రాబోతున్నాడు. వీటిలో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న కూలీ అన్ని కోలీవుడ్ రికార్డ్ లను బద్ధలు కొడుతుందనే అంచనాలున్నాయి. ఆల్రెడీ షూటింగ్ పూర్తయిన కూలీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే జైలర్ కు సీక్వెల్ గా మరో పార్ట్ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం చేస్తున్నాడు. అయితే సమ్మర్ కదా కాస్త ఆలస్యంగా షూటింగ్ చేస్తారు అనుకున్నారు. బట్ జైలర్ 2 ను అత్యంత వేగంగా చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు. అందుకు సూపర్ స్టార్ సహకారం కూడా సూపర్ గా ఉందట. ఈ సారి కూడా శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, మోహన్ లాల్ తరహా పాత్రలు రిపీట్ అవుతాయంటున్నారు.

అయితే చాలామంది జైలర్ 2ను భారతీయుడు 2 కాదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ అందుక అవకాశమే లేదు అని చెప్పాలి. ఎందుకంటే భారతీయుడు 2 పీరియాడిక్ మూవీలాగా వచ్చింది. ఫిక్షనే అయినా పాత్ర వయసు వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉన్నప్పుడే ఈ చిత్రాన్ని నెగెటివ్ గా చూశారు జనం. దీనికి తోడు కథ, కథనాలు మరీ నాసిరకంగా ఉండటంతో తిప్పి కొట్టారు.

బట్ జైలర్ 2 అలా కాదు కదా. ఫస్ట్ పార్ట్ లో ఏకంగా దారి తప్పిన తన కొడుకునే చంపేసుకున్న నిజాయితీ పరుడైన రిటైర్డ్ జైలర్. తనకు పాత గ్యాంగ్ స్టర్స్ తోడుగా ఇంక ఎంతమంది అవినీతి పరులనైనా అంతం చేయొచ్చు. ఇది కాంటెంపరరీ పాయింట్. అలాగే మాస్ కు ఎప్పుడూ కనెక్ట్ అయ్యే పాయింట్. సో.. జైలర్ 2 ను భారతీయుడు 2 తో పోల్చడం దాదాపు మూర్ఖత్వమే అని చెప్పాలి.

Tags

Next Story