Kalyan Ram : కళ్యాణ్ రామ్ కథ ముగిసినట్టేనా

Kalyan Ram :  కళ్యాణ్ రామ్ కథ ముగిసినట్టేనా
X

నందమూరి కళ్యాణ్ రామ్.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి హిట్ మూవీస్ అంటే కేవలం వేళ్లపై మాత్రమే లెక్కపెట్టేన్ని ఉంటాయి. 25 సినిమాలు చేశాడు. బట్ హిట్ విషయం మాత్రం చాలా వెనకబడి ఉంటాడు. అతనొక్కడే, హరి రామ్, 2015లో చేసిన పటాస్ తో పాటు 2019లో చేసిన 118 మూవీతో పాటుగా 2022లో చేసిన బింబిసార మాత్రం విజయాలు. అంటే కేవలం ఖచ్చితంగా ఐదు సినిమాలు మాత్రమే. మిగతా 20 పోయాయి. అంటే ఓ రకంగా హీరోగా అతని కెరీర్ దారుణంగా ఉంది అనే అర్థం. చివరగా చేసిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి భారీ అంచనాలతో వచ్చింది. బట్ ఈ మూవీ కూడా పోయింది.

అతని తర్వాతి సినిమా ఏంటీ అంటే మాత్రం సమాధానం లేదు. అతని నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో అసలు క్లారిటీ లేదు. అసలు సినిమాలు చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు సినిమాల విషయంలో కళ్యాణ్ రామ్ ఎప్పుడో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంటే తెర ముందు కంటే కూడా తెర వెనకే ఇంకేదైనా చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అనే కమెంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఓ వైపుతో ఎన్టీఆర్ మూవీస్ విషయంలో నిర్మాణంలో కనిపిస్తుంటాడు. జై లవకుశ మూవీ నుంచి అది స్టార్ట్ అయింది. అంటే యాక్టివ్ ప్రొడ్యూసర్ గా కూడా కాదు. కేవలం నిర్మాణ భాగస్వామిగా కనిపిస్తుంటాడు. దేవరతో విజయాన్ని అందుకున్నాడు. దేవర 2 గురించి మాట్లాడుతున్నారు. ఓ రకంగా అదే నిజమే. అతను కేవలం నిర్మాతగా ఆగిపోవడం కరెక్టేనేమో అనిపిస్తుంది. లేదూ తెరపై కనిపించాలి అంటే మాత్రం కథల విషయంలో ఖచ్చితంగా ఉండాలి. కథనంపై కాన్ సెంట్రేట్ చేయాలి. కనీసం తన తమ్ముడు ఎన్టీఆర్ తో అయినా సంప్రదింపులు చేసుకోవాలి. లేదంటే అతని కథ అక్కడితే ఆగిపోవడం అవుతుంది. ఏదేమైనా కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తర్వాతి పూర్తిగా సినిమాలకు దూరంగా కనిపిస్తున్నాడు. ఈ దూరం కొనసాగుతుందా లేక మరేదైనా కొత్త సినిమా అనౌన్స్ చేస్తాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Tags

Next Story