Katrina Kaif: ప్రెగ్నెంట్ అయిన బాలీవుడ్ భామ..? సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్..

Katrina Kaif (tv5news.in)
Katrina Kaif: సినీ సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వారి పర్సనల్ లైఫ్ కూడా నెట్టింట్లో చర్చలు నడుస్తూ ఉంటాయి. నటీనటుల రిలేషన్‌షిప్స్ గురించి, పెళ్లి గురించి, ప్రెగ్నెన్సీ గురించి.. ఇలా సెలబ్రిటీలకు సంబంధించిన అన్ని విషయాల గురించి నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. తాజాగా మరో బాలీవుడ్ నటి ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
బాలీవుడ్ సీనియర్ నటి కత్రినా కైఫ్.. తన సహ నటుడు విక్కీ కౌశల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏదైనా ఈజీగా బయటికి వచ్చేసే బాలీవుడ్‌లో వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెళ్లి జరిగే వరకు బయటికి రాలేదు. పెళ్లి నిశ్చయమయిన తర్వాత కూడా వీరి దాని గురించి ఎవ్వరికీ చెప్పలేదు. కానీ చాలామందికి వీరు అప్పుడే ఫేవరెట్ కపుల్ అయిపోయారు.
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. పెళ్లి అయినప్పటి నుండి వీరి పర్సనల్ లైఫ్‌లోని చిన్న చిన్న ఆనందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కపుల్ గోల్స్‌ను సెట్ చేస్తున్నారు. అయితే తాజాగా కత్రినా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే కాకుండా ఈ వీడియో చూసిన నెటిజన్లు కత్రినా ప్రెగ్నెంట్‌లాగా ఉందంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. మరి దీనిలో ఎంత నిజముందో తెలియాలంటే కత్రినానే ఈ రూమర్స్‌కు రెస్పాండ్ అవ్వాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com