Shruthi Haasan : శృతి హాసన్ కు లక్ కలిసి రావట్లేదా?

ఇరవై నాలుగేండ్ల క్రితం తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన "హే రాం" సినిమాలో బాల్యనటిగా కెరీర్ ను ప్రారంభించింది శృతి హాసన్. 2011లో అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కింది ఈ చిత్రం. తర్వాత మై ఫ్రెండ్ అనే సినిమాలోనూ నటించింది శ్రుతి. గబ్బర్ సింగ్తో కొట్టి అప్పటి నుంచి కెరీర్ దూకుడు చూపించింది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొట్టిన శృతి హాసన్ మధ్యలో తన నెగ్లిజెన్సీ వల్ల తెలుగు ఆఫర్లకు దూరమైంది. తిరిగి మళ్లీ తెలుగు ఆఫర్లు అందుకుంటూ వచ్చిన శృతి హాసన్ సీనియర్ స్టార్స్ తో కలిసి నటించింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాల్లో నటించిన అమ్మడు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నా కూడా అమ్మడికి అంత క్రేజ్ రాలేదు. ఐతే ఆ తర్వాత నాని హాయ్ నాన్నలో స్పెషల్ సాంగ్ మెరిసిన శృతి హాసన్ నెక్స్ట్ సలార్ 1లో ప్రభాస్ సరసన నటించింది. సలార్ హిట్ కూడా శృతికి పెద్దగా కలిసి వచ్చినట్టు లేదు. అడివి శేష్తో డెకాయిట్ చేస్తున్న శృతి ఆ తర్వాత ఒక్క ఛాన్స్ కూడా అందుకోలేదు. అటు కోలీవుడ్లో కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు లేవట. తెలుగులోనే కాదు అమ్మడికి తమిళ్ కూడా పెద్దగా లక్ కలిసి రావట్లేదు. శృతి కెరీర్ మళ్లీ దూకు డు చూపించే పరిస్థితి ఎప్పుడు వస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com