మేఘనారాజ్‌ రెండో పెళ్లి.. బిగ్‌‌బాస్ విన్నర్ రియాక్షన్ ఏంటంటే?

మేఘనారాజ్‌ రెండో పెళ్లి.. బిగ్‌‌బాస్ విన్నర్ రియాక్షన్ ఏంటంటే?
కన్నడ, మలయాళ నటి మేఘనారాజ్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందంటూ తాజాగా వార్తలు సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తున్నాయి.

కన్నడ, మలయాళ నటి మేఘనారాజ్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందంటూ తాజాగా వార్తలు సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తున్నాయి. కన్నడ బిగ్‌‌బాస్ 4 విజేత ప్రథమ్‌తో.. మేఘన రెండవ వివాహం జరగనుందని ఆ వార్తల సారాంశం.. అయితే ఈ వార్తల పైన నటి మేఘనారాజ్ స్పందించలేదు.. కానీ ప్రథమ్‌ మాత్రం ట్విట్టర్‌లో తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

యూట్యూబ్‌లోని ఓ వీడియోని షేర్‌ చేస్తూ.. " వ్యూస్‌, డబ్బు కోసం ఇతరులకు ఇబ్బంది కలిగించేలా రూమర్స్‌ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికి వరకు ఈ వీడియోను పట్టించుకోలేదు.. కానీ దాదాపు 2.7 లక్షలపైగా దీన్ని చూశారు. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే ఇంకొకరు ఇలాంటివి పెట్టకుండా ఉంటారు" అంటూ పేర్కొన్నారు. కాగా మేఘనారాజ్.. కన్నడ నటుడు చిరంజీవి సర్జా దాదాపు పది సంవత్సరాలు ప్రేమించుకొని 2018లో పెళ్లి చేసుకున్నారు.

పెళ్ళైన సంవత్సరం తర్వాత జూన్ 7, 2020న తీవ్రమైన గుండెపోటుతో చిరంజీవి సర్జా మరణించారు. అప్పటికి మేఘనారాజ్ గర్భవతి.. తన భర్త మరణించిన నాలుగు నెలల తర్వాత రాయన్ రాజ్ సర్జాకు జన్మనిచ్చింది మేఘన.. దాదాపు ఒక సంవత్సరం తరువాత, మేఘన మళ్లీ పెళ్లి చేసుకుంటుందనే వార్తలు రావడం ఆమెను ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story