Mohan Babu : మోహన్ బాబు అరెస్ట్ కాక తప్పదా.?

Mohan Babu :  మోహన్ బాబు అరెస్ట్ కాక తప్పదా.?
X

విలక్షణ నటుడు మోహన్ బాబు అరెస్ట్ తప్పదా..? ఆయన త్వరలోనే జైలుకు వెళ్లబోతున్నారా అంటే అవుననే అంటున్నారు. రీసెంట్ గా ఆయన కుటుంబంలో అనేక గొడవలు జరిగాయి. మనోజ్ తండ్రిపై కేస్ పెట్టాడు. మోహన్ బాబు కూడా మనోజ్ పై కేస్ పెట్టాడు. మనోజ్ తన అన్న విష్ణుపై కేస్ పెడితే అది అబద్ధం తీసుకోవద్దంటూ వారి తండ్రి నిర్మల కంప్లైంట్ ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే ఏ కుటుంబంలో అయినా ఆస్తి తగాదాలు, మనస్ఫర్థలు కామన్ అని తెలుస్తుంది. అయితే ఈ గొడవ అక్కడి వరకే ఉంటే సరిపోయేది. మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న రచ్చను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై ఆయన దాడి చేశాడు. దాని విషయమై పోలీస్ లు కేస్ నమోదు చేశారు.

ఈ కేస్ లో తనను అరెస్ట్ చేయొద్దంటూ కోర్ట్ కు వెళ్లాడు మోహన్ బాబు. అందుకు తన అనారోగ్యాన్ని కారణంగా చూపించాడు. అయితే కోర్ట్ ఈ నెల 24 వరకూ అరెస్ట్ చేయొద్దని ఆదేశాలచ్చింది. ఈ మేరకు పోలీస్ లు కూడా ఆగారు. సో.. కోర్ట్ చెప్పిన డేట్ వచ్చింది. కాబట్టి అరెస్ట్ చేస్తారని భావించిన మోహన్ బాబు మెందస్తు బెయిల్ కు అప్లై చేసుకున్నాడు. కానీ ఆయనకు బెయిల్ ఇవ్వడం కుదరదని కొట్టివేసింది కోర్ట్. దీంతో ఇక ఆయన అరెస్ట్ తప్పదు అని తేలిపోయినట్టే. రీసెంట్ గా పోలీస్ లు చట్ట ప్రకారం నడుచుకుంటాం అని చెప్పారు. అంటే ఇక మోహన్ బాబు కూడా జైలు గోడలు తడమాల్సిందే అంటున్నారు చాలామంది.

నిజానికి అది ఇంటెన్షనల్ గా చేసింది కాదని.. విష్ణుతో పాటు మోహన్ బాబు కూడా తమ కన్ఫెషన్ వ్యక్తం చేశారు. బాధిత జర్నలిస్ట్ ను హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించి క్షమాపణలు అడిగాడు మోహన్ బాబు. అయినా అతనికి కోర్ట్ లో ఊరట దక్కలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags

Next Story