Naga Chaitanya : నాగ చైతన్య మళ్లీ రాంగ్ స్టెప్ వేస్తున్నాడా..?

Naga Chaitanya :  నాగ చైతన్య మళ్లీ రాంగ్ స్టెప్ వేస్తున్నాడా..?
X

అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చారు. ఒక్క అఖిల్ తప్ప. నాగ చైతన్య తండేల్ తో ప్రూవ్ చేసుకున్నాడు. నాగార్జున కుబేరతో అదరగొట్టాడు. సుమంత్ అనగనగా అనే వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య ఓ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. అందుకే చాలామంది ఈ చిత్రం కోసం ఆసక్తిగా చూస్తున్నారు. మొదట శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. తను తప్పుకుంది. మీనాక్షి చౌదరిని ఫైనల్ చేసుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. అయితే తాజాగా నాగ చైతన్య నెక్ట్స్ మూవీ గురించిన న్యూస్ కొన్ని హల్చల్ చేస్తున్నాయి.

నాగ చైతన్య నెక్ట్స్ మూవీ పిఎస్ మిత్రన్ అనే తమిళ్ డైరెక్టర్ తో ఉండబోతోందనే న్యూస్ వినిపిస్తున్నాయి. మిత్రన్ గతంలో ఇరుంబు తెరై ( తెలుగులో అభిమన్యుడు)తో దర్శకుడుగా పరిచయమైన ఆకట్టుకున్నాడు. తర్వాత శివకార్తికేయన్ తో హీరో అనే సూపర్ హీరో మూవీతో హిట్ కొట్టాడు. ఆపై కార్తీతో సర్దార్ మూవీ రూపొందించి మరో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం సర్దార్ 2 రూపొందిస్తున్నాడు. ఈ మూవీ తర్వాతే నాగ చైతన్యతో ప్రాజెక్ట్ సెట్ అయిందంటున్నారు. ఇది కూడా సర్దార్ తరహాలో ఇండియన్ ఏజెంట్ కథ అని, సోషల్ ఇష్యూస్ పై పోరాడే యువకుడి కథ అనే వార్తలూ వస్తున్నాయి. మరి ఇవి నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.

అయితే నాగ చైతన్య ఇంతకు ముందు వెంకట్ ప్రభు అనే తమిళ దర్శకుడుని నమ్మి దారుణ పరాజయం చూశాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం చేసిన కస్టడీ సినిమా డిజాస్టర్ అయింది. నిజానికి తమిళ్ డైరెక్టర్స్ ఎవరూ తెలుగు హీరోలకు హిట్ లు ఇచ్చిన దాఖలాలు ఈ మధ్య లేవు. అయినా చైతూ ఆ తప్పు మళ్లీ చేస్తాడు అనుకోలేం. అలాగని కాదని కూడా చెప్పలేం.

Tags

Next Story