చైతూ 'లవ్ స్టోరీ' పై వైరల్ అయిన నాగార్జున ట్వీట్.. సమంతకి...

చైతూ లవ్ స్టోరీ పై వైరల్ అయిన నాగార్జున ట్వీట్.. సమంతకి...

తెలుగు సూపర్ స్టార్ నాగార్జున తన కుమారుడు నాగ చైతన్య, కోడలు సమంత రూత్ ప్రభు మధ్య విభేదాలను సరిదిద్దడానికి, విడాకుల నుండి దూరంగా ఉండటానికి సహాయం చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నటులు నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు విడాకులకి వెళ్తున్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సమంత తన సోషల్ మీడియా నుండి అక్కినేని ఇంటిపేరును వదిలివేసిన తరువాత అనుమానాలు ఎక్కువయ్యాయి. నాగ చైతన్య తండ్రి నాగార్జున ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి, విడాకుల నుండి బయటపడటానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

నివేదికల ప్రకారం, "నాగ చైతన్య ప్రేమగల భర్త. మజిలీ చిత్రంలో అతను తన భార్యతో తెరపై కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు, ఆమె కళ్ళను చూడటం చాలా కష్టంగా అనిపించిందని సినిమా సమయంలో పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తడం అతడికి అస్సలు మింగుడు పడట్లేదు.

ఇద్దరూ మ్యారేజ్ కౌన్సిలర్‌ను కలుసుకున్నారని, ఫ్యామిలీ కోర్టును కూడా సంప్రదించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, ఆ నివేదికలను అక్కినేని కుటుంబ సభ్యులుఎవరూ ఇంకా ధృవీకరించలేదు. నాగార్జున కూడా వారి దాంపత్య జీవితం విడాకుల వరకు వెళ్లకూడదని కోరుకుంటున్నారు. కొడుకు, కోడలి మధ్య విభేదాలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన 'లవ్ స్టోరీ' సినిమా బాగుందిరా చైతూ అని నాగార్జున ట్వీట్ చేశారు. అలాగే 1971లో తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమనగర్ చిత్ర పోస్టర్‌ని అందులో ఉంచారు. అనూహ్యంగా దాదాపు 30 ఏళ్ల తరువాత అదే డేట్‌కి నాగచైతన్య సినిమా రావడం అభిమానులను ఆనందపరుస్తుంది. కాగా.

సమంత కూడా లవ్ స్టోరీ టీమ్‌ని అభినందిస్తూ ట్వీట్ చేసింది. దానికి థ్యాంక్యూ శామ్ అంటూ నాగ చైతన్య ట్వీట్ చేయడం వారిద్దరి మధ్య విభేదాలు సమసి పోతున్నట్లు తెలుస్తోంది. మోస్ట్ లవబుల్ కపుల్‌గా ఇండస్ట్రీలో పేరున్న చై, శామ్‌ల వైవాహిక జీవితం అపార్థాలకు తావు లేకుండా సంతోషంగా సాగాలని అభిమానులూ కోరుకుంటున్నారు.

Read MoreRead Less
Next Story