NTR : ఎన్టీఆర్ తప్పు చేస్తున్నాడా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీస్ విషయంలో ఓ మిస్టేక్ చేస్తున్నాడా అంటే అవును అంటున్నారు.. కాదు అనే సమాధానం కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ తర్వాత అతని సెలెక్షన్ కరెక్ట్ గానే ఉంది. బట్ రిలీజ్ టైమ్ లు మాత్రం చాలా మారిపోతున్నాయి. దేవర తర్వాత అతని ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో చాలా తప్పులు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. నిజానికి ఈ మూవీ గతేడాదే విడుదలవుతుందని చెప్పారు. కానీ ఈ యేడాది జూన్ 25న విడుదల చేయబోతున్నాం అని అఫీషియల్ గా ప్రకటించారు. అంటే చాలా టైమ్ ఉంది కాబట్టి రిలీజ్ చాలా ఈజీ అవుతుంది అనుకున్నారు. బట్ ఇప్పుడు మరో రిలీజ్ డేట్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ - నీల్ మూవీని ఈ యేడాది జూన్ 25 నుంచి ఏడాది పాటు పోస్ట్ పోన్ చేయబోతున్నారు అంటున్నారు. అంటే సింపుల్ గా చూస్తే 2027 మే లేదా మళ్లీ జూన్ లోనే విడుదల చేయాలనుకంటున్నారు అనే బలంగా వినిపిస్తోంది. మామూలుగా ఇది మొదట ఒకే పార్ట్ గా చేయాలనుకున్నారు. బట్ రెండు భాగాలు అని మార్చారు. మరి ఈ రెండు భాగాల కారణంగా ఇంత దూరం వాయిదా పడబోతోందా లేక ఇంకేదైనా బలమైన కారణాలున్నాయా అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే వచ్చే యేడాది రాజమౌళి వారణాసి మూవీ తర్వాతే ప్రశాంత్ నీల్ నే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు అంటూ చెబుతున్నారు. మరి ఇంత దూరం పోస్ట్ పోన్ చేయడం విషయంలో ఎన్టీఆర్ తప్పు చేస్తున్నాడా లేక ఒప్పు చేస్తున్నాడా అనేది కాలం చెప్పే సమాధానం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
