NTR : ఎన్టీఆర్ కొత్త సినిమా అనౌన్స్ కాబోతోందా..?

NTR :  ఎన్టీఆర్ కొత్త సినిమా అనౌన్స్ కాబోతోందా..?
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొత్త సినిమా రెడీ అవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అఫ్ కోర్స్ ఆ కథ ఆల్రెడీ రెడీగా ఉంది. కాకపోతే దర్శకుడు వేరే ప్రాజెక్ట్ లో ఉన్నాడు. అటు ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తున్నాడు. తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. మరి ఈ సినిమా ఏంటీ ఎవరిదీ అనిపిస్తోంది కదా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ది. యస్.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో రాబోతోన్న మూవీకి సంబంధించి ఓ పెద్ద అప్డేట్ వచ్చింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇటు ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ తో మూవీ ఆ టైమ్ కు మాగ్జిమం పూర్తి చేస్తాడు. ఆ కారణంగా ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతోంది. అయితే ఈ క్రేజీ మూవీ డివోషనల్ టచ్ తో సాగే పౌరాణిక చిత్రం ఇది అని ముందు నుంచీ చెబుతున్నారు కదా. అలాగని ఎన్టీఆర్ ను కేవలం డివోషనల్ గా మాత్రమే చూపడం కాదు. కాస్త పవర్ ఫుల్ గా కూడా చూపించబోతున్నారు.

ఇక ఈ చిత్రానికి షణ్మఖుడు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. గాడ్ ఆఫ్ వార్ అనే ట్యాగ్ కూడ ఉంటుందట. ఈ మూవీకి సంబంధించి మే 20న ఓ సాలిడ్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఈ అప్డేట్ ఇవ్వబోతున్నారు. టైటిల్ తో పాటు ఓ అద్భుతమైన లుక్ కూడా విడుదల చేస్తారని టాక్. మొత్తంగా ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ కు మంచి బర్త్ డే స్పెషల్ కిక్ ఇవ్వబోతున్నారు అని టాక్.

Tags

Next Story