బాలయ్యకు పోటీగానే ఎన్టీఆర్ ఇలా చేశాడా..?

నందమూరి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో బిగ్గీస్ అందరితో కలిపి ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఆహ్వానం ఉన్నా.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా.. చాలామంది హాజరు కాలేకపోయారు. అయినా వేడుక కన్నుల పండగలా జరిగింది. అయితే ఎవరొచ్చినా లేకున్నా నందమూరి కుటుంబం అంతా హాజరవుతుందని అందరికీ తెలుసు. బట్ ముందు నుంచీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లపై కాస్త అనుమానం ఉంది. అనుమానించినట్టుగానే కళ్యాణ్ రామ్ సంగతేమో కానీ.. ఎన్టీఆర్ కు ఆహ్వానం అందలేదు అని విశ్వసనీయ సమాచారం.
ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిందా లేదా అనేది పక్కన బెడితే బాలయ్య ఫంక్షన్ రోజు టాలీవుడ్ అటెన్షన్ ను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇన్నేళ్లుగా ఎప్పుడూ లేనిది సడెన్ గా అదే రోజు అమ్మ కోరిక మేరకు అంటూ ఆమె సొంత ఊరైన కుందాపురకు వెళ్లడం.. ఉడిపిలోని శ్రీ కృష్ణ టెంపుల్ ను సందర్శించడంతో పాటు తన వెంట నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టితో పాటు టాప్ డైరెక్ట్ ప్రశాంత్ నీల్ కూడా తిప్పుకుంటూ అదే పనిగా సోషల్ మీడియాలో ఫోటోస్ వదలడం చూస్తే ఇదంతా బాలయ్య ఫంక్షన్ కు రాలేదు అని డైరెక్ట్ గా చెప్పడంతో పాటు ఆ రోజు అందరి అటెన్షన్ తనవైపే ఉండేలా చేసుకోవడమే అనేది కొందరి భావన.
మరోవైపు ఆ ప్రాంతంలోనే ఒక పురాతన దేవాలయాన్ని రిషబ్, ప్రశాంత్ తో కలిసి సందర్శించాడు ఎన్టీఆర్. అయితే దీనికి వాళ్లు కార్లో వెళుతున్న డ్రోన్ విజువల్స్, ఆ టెంపుల్ లోకి వెళ్లిన ఫోటోస్ అన్నిటిని వరుసగా విడుదల చేయడం కూడా చూస్తే బాలయ్య కు పోటీగానే ఎన్టీఆర్ ఇదంతా చేశాడా అనే అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ ఇప్పటి వరకూ అనేక వెకేషన్స్ కు వెళ్లాడు. కానీ ఎప్పుడూ ఇలా వెళ్లిన రోజునే వరుసగా ఇన్ని ఫోటోస్ ను సోషల్ మీడియాలో ఎప్పుడూ విడుదల చేయలేదు. అంటే ఇదంతా కావాలనే ప్లానింగ్ ప్రకారమే జరిగిన వ్యవహారంలా అనిపించడం లేదూ.. అని బాలయ్య ఫ్యాన్స్ గుసగుసలు పోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com