Prashanth Neel : బఘీరను వదిలేసిన దర్శకుడు

డబ్బింగ్ సినిమాలపై ఈ మధ్య తెలుగులో కొత్త వైఖరి కనిపించింది. అందుకు ప్రధాన కారణం వాళ్లు తెలుగులో టైటిల్స్ పెట్టకపోవడమే అనేది క్లియర్ గా తేల్చారు. రజినీకాంత్ నటించిన వేట్టైయన్ మూవీని మనవాళ్లు అస్సలు పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం ఇదే. అయితే తమిళ్ హీరోలపై తెలుగు ప్రేక్షకులకు ముందు నుంచీ ప్రత్యేక అభిమానం చూపుతున్నారు. అది వేట్టైయన్ కు వర్కవుట్ కాలేదు అనేది చెప్పాలి. ఇక డబ్బింగ్ మూవీస్ అంటే చాలా వరకూ తమిళ్ నుంచే వస్తాయి. కన్నడ సినిమాలను, హీరోలను ఇక్కడ పెద్దగా పట్టించుకోరు. అయినా అస్సలే మాత్రం పరిచయం లేని కన్నడ హీరో శ్రీ మురళి నటించిన బఘీరను తెలుగులోనూ ఈ శుక్రవారం విడుదల చేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ప్రస్తుతం ప్యాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకుంటోన్న ప్రశాంత్ నీల్.
బఘీరా చిత్రాన్ని డాక్టర్ సూరి డైరెక్ట్ చేశాడు. అయితే ఈ కథను అందించింది ప్రశాంత్ నీల్. దీంతో ఈ మూవీకి తెలుగులో భారీ హైప్ వస్తుందని.. దీంతో శ్రీ మురళికి మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావించారు. పైగా మూవీ ప్రమోషన్స్ లో ప్రశాంత్ కూడా ఉంటాడు అనే సంకేతాలు వచ్చాయి. కానీ అలాంటిదేం లేదు. ప్రశాంత్ రాలేదు. శ్రీ మురళి తెలియదు. హీరోయిన్ రుక్మిణి వసంత్ కు యూత్ లో కొంత క్రేజ్ ఉన్న మాట వాస్తవం. కానీ ఆ క్రేజ్ తో ఓపెనింగ్స్ రావు అనేది నిజం. అందుకే రేపే విడుదల కాబోతున్నా.. ఇప్పటి వరకూ ఈ మూవీపై మినిమం బజ్ కనిపించడం లేదు. ఓపెనింగ్స్ సంగతి అటుంచితే.. అసలు రిలీజ్ అవుతున్న థియేటర్స్ లో మొదటి ఆట అయినా పూర్తిగా పడుతుందా అనేదే డౌట్ గా కనిపిస్తోంది.
నిజానికి ప్రశాంత్ నీల్ ప్రమోషన్స్ చేసి ఉంటే పరిస్థితిలో కొంత మార్పు ఉండేది. అతను రాకపోవడం వల్లే ఇలా ఉంది అని చెప్పడానికి కూడా లేదు. అసలు ఈ ట్రైలర్ మనవారికి పెద్దగా కనెక్ట్ కాలేదు. కంప్లీట్ గా కేజీఎఫ్ ఫ్లేవర్ లోనే కనిపిస్తోంది. ఊరమాస్ ఎంటర్టైనర్ గా చాలా సినిమాలను కలిపి చేసిన కిచిడిలా ఉందనే కమెంట్స్ వచ్చాయి. అదీ ఓ కారణంగానూ అనుకోవచ్చు. మొత్తంగా కన్నడలో రోరింగ్ స్టార్ అనిపించుకున్న శ్రీ మురళి తెలుగు ఎంట్రీ చాలా డల్ గా ఉందనేది నిజం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com