Rajanikanth: ఇకపై రజనీ సినిమాల్లో..

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంత మంది యంగ్ హీరోలు వచ్చినా అభిమానుల్లో ఆయనకు ఉన్న ఇమేజ్ ఎవరూ కాదనలేనిది. ఆరుపదుల వయసులో కూడా యంగ్ హీరో, హీరోయిన్స్ తో పోటీ పడి నటిస్తుంటారు.
ఇప్పటికీ ఆయన సినిమా వస్తుందంటే అభిమానుల్లో అదే ఉత్సాహం, అదే హడావిడి కొనసాగుతుంది. తాజాగా ఆయన నటించిన అన్నాత్తై చిత్ర షూటింగ్ పూర్తయింది. షూటింగ్ లో ఉండగానే కరోనా వచ్చి కోలుకున్నారు. ఇదే ఆయన చివరి చిత్రం అవుతుందా అని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
అయితే ఆరోగ్యం సహకరిస్తే మరిన్ని సినిమాల్లో నటిస్తానని కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టిన తరువాత డాక్టర్ దగ్గరకు వెళ్లి హెల్త్ చెకప్ చేయించుకుంటానని ఓ సందర్భంలో రజనీ అన్నారు. అయిదు దశాబ్ధాల క్రితం మొదలైన ఆయన సినీ ప్రస్థానంలో దాదాపు 160కి పైగా చిత్రాల్లో నటించారు.
ఇక అన్నాత్తై చిత్రంలో కీర్తి సురేష్, నయనతార, ఖుష్భూ, మీనా, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com