Rajinikanth : రజినీకాంత్, లోకేష్ కూలీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయసులో కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అదే ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఇతర స్టార్స్ తో కలిసి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. అలాంటి సూపర్ స్టార్ లోకేష్ సినీవర్స్ లోకి ఎంటర్ అవుతున్నాడు అంటే ఖచ్చితంగా అంచనాలు పీక్స్ లో ఉంటాయి. పైగా లోకేష్ కనగరాజ్ మామూలు కాస్టింగ్ తీసుకోలేదీ సినిమాకు. తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, మళయాలం నుంచి సౌబిన్ షబిర్ తో పాటు సత్యరాజ్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. మెయిన్ ఫీమేల్ లీడ్ గా శృతి హాసన్ కనిపించబోతోంది. లోకేష్ కు బాగా ప్లస్ అయిన అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం చేస్తున్నాడు. కళానిధి మారన్ నిర్మిస్తోన్న కూలీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అనేక సంచలనాలు సృష్టిస్తుందని చెబుతున్నారు.
లోకేష్ ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ చేస్తే అస్సలు ఆపడు. కూలీ అనౌన్స్ అయిన దగ్గర నుంచి శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాడు. దీంత పాటు రిలీజ్ డేట్ కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడట. ఈ మేరకు ప్రస్తుతం కోలీవుడ్ నుంచి వినిపిస్తున్నది ఏంటంటే.. ఈ మూవీ టైటిల్ కు తగ్గట్టుగా 2025 మేడే రోజు విడుదల చేయబోతున్నారట. అంటే మే 1న విడుదల కాబోతోందన్నమాట. ఈ డేట్ లో మార్పులు ఉండకపోవచ్చు అనే అంటున్నారు. అందరు ఆర్టిస్టులను కరెక్ట్ గా సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది రాకుండా వేగంగా షూట్ చేస్తున్నాడట. ఇక ఏదైనా లేట్ అంటూ ఉంటే అది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వల్లే అని వేరే చెప్పక్కర్లేదు. బట్ అతను తమిళ్ వాళ్లకు ఇన్ టైమ్ లోనే అవుట్ పుట్ ఇస్తాడు.
మొత్తంగా ఇప్పటి వరకూ లోకేష్ మూవీస్ లో డ్రగ్స్ మెయిన్ విలన్ గా కనిపించేవి. కూలీలో మాత్రం బంగారం హైలెట్ గా ఉండబోతోంది. ఈ బంగారంతో అతను ఎలాంటి కథ చెప్పబోతున్నాడో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com