Rajamouli Devara : దేవరతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అవ్వొచ్చు.. కానీ..

Rajamouli Devara  :  దేవరతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అవ్వొచ్చు.. కానీ..
X

రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరో అయినా డిజాస్టర్ చూడాల్సిందే. ఇదో పేద్ద సెంటిమెంట్ గా మారింది ఇండస్ట్రీలో. దీన్ని ఇప్పటి వరకూ ఏ హీరో తప్పించుకోలేకపోయాడు. చివరికి రామ్ చరణ్ కూడా ఆచార్య చూశాడు. బట్ ఎన్టీఆర్ కు మిస్ అయ్యే అవకాశాలున్నాయి. రాజమౌళి తర్వాత చేసిన ఏ సినిమాకైనా యూనానిమస్ గా డిజాస్టర్ అనే టాక్ తెచ్చుకునేవి. బట్ ఫస్ట్ టైమ్ దేవరకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. పండగ శెలవులు చాలానే ఉన్నాయి. ఈ వీకెండ్ మొత్తం ఆల్రెడీ బుక్ అయిపోయింది. సో.. హాలిడేస్ లో రిపీట్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ కు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ రకంగా కమర్షియల్ గా పెద్ద విజయం సాధిస్తుందని వేరే చెప్పక్కర్లేదు. ఈ కారణంగా ఏ హీరోతో ఈ సెంటిమెంట్ మొదలైందో.. ఆ హీరోనే బద్ధలు కొట్టాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చూస్తున్నాం. అయితే నిజంగా అది జరిగిందా అంటే లేదు అనే చెప్పాలి.

రాజమౌళి సెంటిమెంట్ ను కేవలం కలెక్షన్స్ తోనే కాదు.. కంటెంట్ తో కూడా బద్ధలు కొట్టాలి. రాజమౌళిని మించిన ఎమోషన్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉండి.. కమర్షియల్ గా విజయం సాధిస్తే.. అప్పుడు.. అది సాలిడ్ హిట్ అని చెప్పొచ్చు. అందువల్ల దేవర విజయం కేవలం ఆ సెంటిమెంట్ కు సంబంధించి ఒక బ్రేక్ పాయింట్ అంతే..కానీ పర్మనెంట్ కాదు. ఇది ఇంకెవరైనా సాధిస్తారేమో చూడాలి.

Tags

Next Story