Nithiin Robinhood : రాబిన్ హుడ్ అంచనాలను అందుకున్నాడా

Nithiin Robinhood :  రాబిన్ హుడ్ అంచనాలను అందుకున్నాడా
X

హిట్ కాంబినేషన్ లో సినిమా అంటే మళ్లీ హిట్ నే ఎక్స్ పెక్ట్ చేస్తారు.దీనికి తోడు విపరీతమైన ప్రమోషన్స్ కూడా కనిపించడంతో వారికి సినిమాపై ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థం అవుతుంది. గత క్రిస్మస్ సందర్భంగా విడుదల కావాల్సిన రాబిన్ హుడ్ చాలా ఆలస్యంగా ఈ శుక్రవారం విడుదలైంది. శ్రీలీల హీరోయిన్ గా రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ టాక్ వినిపించలేదు అనే చెప్పాలి. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన రాబిన్ హుడ్ లో అతని మార్క్ కామెడీ లోపించింది అంటున్నారు. అతను అంతకు ముందు రూపొందించిన ఛలో, భీష్మ చిత్రాలు విపరీతంగా నవ్వించాయి. కానీ ఆ నవ్వులు రాబిన్ హుడ్ లో మిస్ అయ్యాయి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కంటెంట్ పరంగానూ చాలా అవుట్ డేటెడ్ అనేది ప్రధానంగా వస్తోన్న విమర్శ.ఇంకా చెబితే రవితేజ కిక్ మూవీ తరహా ట్రీట్మెంట్ కనిపించినా.. పాత్రల్లో ఆ స్థాయి బలం లేకపోవడం మైనస్ అయింది. ఇటు హీరోయిన్ పాత్ర కూడా పెద్ద బలంగా లేదు. కాకపోతే రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ మధ్య వచ్చే కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయింది. రాబిన్ హుడ్ అనగానే పెద్దలను కొట్టి పేదలకు పెట్టే వాడుగా చరిత్ర ఉంది. ఇందులోనూ అదే చేశాడు కానీ.. అది ఆడియన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో దర్శకుడి వైఫల్యం కనిపిస్తుంది. రైటింగ్ పరంగా వీక్ గా ఉండటం.. ప్రధానంగా ఆశించిన కామెడీ లేకపోవడం, ప్లాట్ పాతది కావడం వంటి కారణాలతో రాబిన్ హుడ్ పై కాస్త నెగెటివ్ మార్కులు చూపిస్తోంది.

ఏదేమైనా నితిన్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. పైగా వీరి కాంబోలో వచ్చిన భీష్మ అతనికి పెద్ద విజయాన్నిచ్చింది. ఆ తర్వాత చేసిన ఏ సినిమా కూడా హిట్ కాలేదు. అందుకే వెంకీ కుడుముల మరోసారి తనను హిట్కెక్కిస్తాడు అని భావించిన నితిన్ ఆశలు నెరవేరతాయా లేదా అనేది ఈ వీకెండ్ తో పాటు సోమవారం కూడా పబ్లిక్ హాలిడే కాబట్టి అప్పటి వరకూ తెలిసిపోతుంది.

Tags

Next Story