Pooja Hegde: నమ్మలేని నిజం: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ బుట్టలో.. బుట్ట బొమ్మ

Pooja Hegde: నమ్మలేని నిజం: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ బుట్టలో.. బుట్ట బొమ్మ
Pooja Hegde: తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగుతూ.. కుర్రాళ్లకు, కొందరు దర్శకులకూ కలల రాణి అనిపించుకున్న పూజాహెగ్డే..

Pooja Hegde: తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగుతూ.. కుర్రాళ్లకు, కొందరు దర్శకులకూ కలల రాణి అనిపించుకున్న పూజాహెగ్డే..అందరి హార్ట్స్ ను బ్రేక్ చేసిందనే వార్త వినిపిస్తోంది. అంటే అమ్మడు కూడా ప్రేమలో పడిందట. అది కూడా తనకంటే డబుల్ ఏజ్ ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో. కొన్ని వార్తల నమ్మడం కంటే ముందు డైజెస్ట్ చేసుకోవడం కష్టమే. మరి ఇంతకీ ఈ బుట్టబొమ్మను వలలో వేసుకున్న అతగాడెవరో..?



పూజాహెగ్డే.. తెలుగులో టాప్ హీరోయిన్ గానే ఉన్నా.. అమ్మడి ఆలోచన ఎప్పుడూ బాలీవుడ్ లో పాగా వేయాలనే ఉంటుంది. అందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేసింది. కానీ.. తన కలను నెరవేర్చే హిట్స్ పడటం లేదక్కడ. అక్కడ జెండా పాతేందుకు ఎంత హాట్ గా అయినా నటించేందుకు సిద్ధ పడ్డా.. విజయాలు లేక మళ్లీ సౌత్ లోనే ఆగిపోతుంది. అయినా ప్రయత్నాలు ఆపడం లేదు.



ఈ క్రమంలో మరోసారి బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. ఇందులో సర్కస్ అనే సినిమా ఈ నెల మూడో వారంలో విడుదల కాబోతోంది. మరోటి సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రం తమిళ్ లో వచ్చిన వీరమ్ అనే సినిమాకు రీమేక్.


ఈ వీరమ్ ను తెలుగులో పవన్ కళ్యాణ్‌ కాటమరాయుడుగా రీమేక్ చేశాడు. వెంకటేష్‌ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో హీరోయిన్ పూజాహెగ్డే. మామూలుగా సల్మాన్ ఖాన్ తో నటించే ప్రతి హీరోయిన్ తోనూ ఎఫైర్ అంటగట్టడం బాలీవుడ్ లో కామన్ గా చూస్తుంటాం.



ఆ సినిమా పూర్తయిన తర్వాత మళ్లీ ఆ న్యూస్ కనిపించదు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం భాయ్ ను అంటిపెట్టుకుని ఉంటారు. ఇప్పుడు పూజాహెగ్డే కూడా అదే చేస్తోందట. సల్మాన్ తో కలసి ముంబై అంతా చక్కర్లు కొడుతోందనీ.. లేట్ నైట్ పార్టీస్ లోనూ హల్చల్ చేస్తోందనీ బీ టౌన్ లో రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి.



సల్మాన్ తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసిన భామలకు బాలీవుడ్ లో ఆఫర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయని మూడు దశాబ్దాలుగా చూస్తున్నాం. అయితే సల్మాన్ మాత్రం అందరినీ ఫ్రెండ్లీగానే ట్రీట్ చేస్తాడు అనే టాక్ కూడా ఉంది. ఆ స్నేహాన్ని పెంచుకుని అతని ద్వారా కూడా బాలీవుడ్ లో పాగా వేసిన వాళ్లు చాలామందే ఉన్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే కూడా ఈ ప్రయత్నాల్లోనే ఉందంటున్నారు.



అందుకే తనకంటే డబుల్ ఏజ్ ఉన్న సల్మాన్ తో రొమాన్స్ చేస్తోందని బాలీవుడ్ లో ఎన్ని వార్తలు వచ్చినా తను పట్టించుకోవడం లేదు. పైగా ఎంజాయ్ చేస్తోందట. అలా అయినా నిత్యం న్యూస్ లో ఉండొచ్చు కదా అని. మొత్తంగా బుట్టబొమ్మ ప్రేమలో పడిందనే వార్త మాత్రం చాలామందిని నిద్రకు దూరం చేసిందనే చెప్పాలి.

Tags

Read MoreRead Less
Next Story