Samantha : టాలీవుడ్ కు సమంత దూరం కానుందా?

Samantha : టాలీవుడ్ కు సమంత దూరం కానుందా?
X

స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ) టాలీవుడ్ కు దూరం కానుందనే వార్తలు నెట్టింట వైరలవుతున్నాయి. తన మాజీ భర్త నాగచైతన్య శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకోవడం ఒకరకంగా ఆమెకు షాక్ తగిలినట్లయింది. అధికారికంగా ఆమె దీనిపై స్పందించిన పోయినప్పటికీ గతంలో వివిధ సందర్భాల్లో తన పెళ్లి, వివాహ జీవితంపై చేసిన పరోక్ష వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధి బారిన పడి సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ. రీసెంట్గానే 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్లో మళ్లీ మనముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.. అలా సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుండగా తన మాజీ భర్త నాగచైతన్య శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకోవడంతో మళ్లీ ఆమె నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. ఇవన్నీ మరిచిపోయి సినిమాల్లో బిజీ కావడానికి ప్రయత్నిస్తోంది సామ్. ఇందుకోసం ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నదనే వార్తలొస్తున్నాయి. ఇప్పటినుంచి తెలుగులో ఇక నటించకూడదని డిసైడ్ అయ్యిందని టాక్ వినబడుతోంది.. టాలీవుడ్లో ఎన్ని సినిమాలు చేసినా, తన వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టి చూస్తున్నారని ఆందోళన చెందుతోందట. అందుకే కోలీవుడ్లో, బాలీవుడ్లో మాత్రమే నటించాలని నిర్ణయం తీసుకుందట. ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

Tags

Next Story