Samantha: సమంత డిప్రెషన్‌లో ఉందా? చేతిలో ఆ బుక్ దేనికి సూచన..

Samantha: సమంత డిప్రెషన్‌లో ఉందా? చేతిలో ఆ బుక్ దేనికి సూచన..
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం హాటెస్ట్ నటి. ఏదో ఒక కారణంతో ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫోటోలు మరోసారి చర్చకు దారితీశాయి.

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం హాటెస్ట్ నటి. ఏదో ఒక కారణంతో ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫోటోలు మరోసారి చర్చకు దారితీశాయి. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌, పుష్ప చిత్రంలోని ఐటెం సాంగ్ విజయంతో ఆమెకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న సమంతకు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది.

కాగా, సమంత నిన్న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించేసరికి కెమెరా ఆమెవైపు ఫోకస్ అయింది. ఎయిర్‌పోర్ట్‌లో తీసిన ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా, ఈ ఫోటోలు చూసిన తర్వాత, చాలా మంది సమంత డిప్రెషన్‌లో ఉందని చెప్పుకోవడం మొదలుపెట్టారు.

ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన సమంత చేతిలో ఓ పుస్తకం కనిపించింది. 'యు కెన్ హీల్ యువర్ లైఫ్' అనే పుస్తకం పేరు చూసి తమ అభిప్రాయం కరెక్టే అని సమర్ధించుకుంటున్నారు. సమంత డిప్రెషన్‌లో ఉందని, దాని నుంచి బయటపడేందుకు అటువంటి పుస్తకాలు చదువుతోందని పలువురు అంచనా వేస్తున్నారు. కొందరు సమంతపై ఆందోళన కూడా వ్యక్తం చేశారు.

నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఇంకా కోలుకోలేదని, సమంత చేతిలో ఉన్న పుస్తకం రుజువు చేస్తోందని అంటున్నారు. గతేడాది అక్టోబర్‌లో సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే వీరిద్దరి విడాకులకు కారణం ఇంత వరకు ఎవరూ బయటపెట్టలేదు.

ఇద్దరూ కలిసి సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా అని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్యను అడగ్గా.. అదే జరిగితే అదో క్రేజీ న్యూస్ అవుతుంది అని అన్నారు. కానీ సమంత మాత్రం నాగచైతన్య పేరు తలవడానిక్కూడా ఇష్టపడనట్లు ఉంటోంది. కానీ ఏదో ఒక అద్భుతం జరిగి మళ్లీ ఇద్దరూ కలుసుకుంటే బావుండని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story