Samantha : సమంతకు ‘శుభం’ జరుగుతుందా..?

టాలెంటెడ్ హీరోయిన్ సమంత పర్సనల్ లైఫ్ లో జరిగిన ట్రాజెడీస్ అన్నిటినీ దాటేసిందనే చెప్పాలి. హెల్త్ కూడా సెట్ అయిపోయింది. అయితే మళ్లీ హీరోయిన్ గా, నటిగా కాకుండా ఈ సారి నిర్మాతగా కొత్త అడుగులు మొదలుపెట్టింది. నిజానికి ఈ కాలంలో నిర్మాణం అనేది పెద్ద రిస్క్. అయినా తను ప్రొడ్యూసర్ గా మారింది. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’అంటూ తన బ్యానర్ పేరు పెట్టింది. ఈ బ్యానర్ లో ఫస్ట్ మూవీగా ‘శుభం’అనే చిత్రాన్ని నిర్మించింది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. హర్షిత్ ఆర్, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రియా కొంతం, షాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కాబోతోంది. రీసెంట్ గా వైజాగ్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సమంత చాలా చాలా ఉత్సాహంగా కనిపించింది. పైగా వైజాగ్ లో ఫంక్షన్ జరుపుకున్న సినిమాలన్నీ తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయ్యాయని.. మజిలీ, రంగస్థలం వంటి మూవీస్ ను ఉదాహరణలుగా చెప్పింది.
సీనియర్ ప్రొడ్యూసర్స్ కూడా సినిమాలు రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడుతోన్న టైమ్ ఇది. ఈ టైమ్ లో తను ప్రొడక్షన్ లోకి దిగడం వెనక కారణాలేవైనా.. ఈ మూవీకి తను తప్ప మరో అట్రాక్షన్ కనిపించడం లేదు. పైగా సినిమాలో తనూ నటించింది. ట్రైలర్ లోని చివరి షాట్ చూస్తే ఓ కీలకమైన పాత్రే చేసినట్టు కనిపిస్తోంది. ఇదో హారర్ కామెడీ మూవీగా రూపొందినా.. ఏదో మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారని అర్థం అయింది. అయితే పోస్టర్ లో ఉన్నవాళ్లెవరూ పెద్దగా తెలియని మొహాలు. ఒకరిద్దరు తెలిసినా.. ఆడియన్స్ ను థియేటర్స్ వరకూ రప్పించే సత్తా ఉన్నవాళ్లు కాదు. కేవలం సమంత కోసమే ప్రేక్షకులు ఈ చిత్రానికి రావాలి. మరి ఇప్పుడు సమంత కోసం థియేటర్స్ వరకూ వస్తారా అనుకోవడానికి లేదు. తను మెయిన్ లీడ్ గా చేసిన యశోద, శకుంతల చిత్రాలకు మంచి ఓపెనింగ్సే వచ్చాయి. కాకపోతే ఈ బ్యానర్స్, డైరెక్టర్స్ బాగా తెలిసినవాళ్లు.
ఏదేమైనా నిర్మాతగా మొదటి అడుగు వేయబోతోన్న సమంతకు మొదటి శుభంగా పెద్దగా పోటీ లేదు. తనతో పాటు వస్తోన్న మూవీస్ డిఫరెంట్ జానర్స్ లో కనిపిస్తున్నాయి. అంచేత ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే.. ఆ బడ్జెట్ కు తగ్గట్టుగా తను హ్యాపీస్ అయిపోతుంది. మరి శామ్ కు ఈ మూవీ ఆర్థికంగా కూడా శుభం చేకూరుస్తుందా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com