Sekhar Kammula : కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా..?

అక్కినేని నాగార్జున, ధనుష్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తోన్న సినిమా కుబేర. ఈ మూవీ ఎప్పుడో ప్రారంభం అయినా ఇప్పటి వరకూ పెద్దగా అప్డేట్స్ ఏం రావడం లేదు. వచ్చినవేవీ ప్రేక్షకులకు పెద్దగా అర్థం కావడం లేదు. ఇది ప్లానింగ్ లో భాగం అనుకోవాలా లేక మేకర్స్ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారా అనేది తెలియడం లేదు. పైగా శేఖర్ కమ్ముల ఫస్ట్ టైమ్ పెద్ద స్టార్స్ తో పనిచేస్తున్నాడు. ఈయన వర్కింగ్ స్టైల్ కాస్త స్లోగా ఉంటుందనే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. ఇప్పటి వరకూ చిన్న వాళ్లతో చేశాడు కాబట్టి ఇదేమంత ప్రాబ్లమ్ కాదు. బట్ ఈ సారి అదే ప్రాబ్లమ్ అయిందని.. ఆ కారణంగానే సినిమా ఇంకా ఇంకా లేట్ అవుతుందనే కామెంట్స్ కూడా లేకపోలేదు.
ఆ మధ్య విడుదల చేసిన గ్లింప్స్ చూసి చాలామందికి ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాలేదు అంటే శేఖర్ కమ్ముల ఎంత కన్ఫ్యూజ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. బట్ సినిమాపై ఎవరికీ డౌట్స్ లేవు. కాకపోతే వచ్చే అప్డేట్స్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటే అంచనాలు పెరుగుతాయి కదా అని. మొత్తంగా ఈ కుబేరను 2024 డిసెంబర్ లోనే విడుదల చేస్తారు అన్నారు. తర్వాత సంక్రాంతికి రావొచ్చేమో అనుకున్నారు. ఈ రెండూ పోయాయి. సమ్మర్ గ్యారెంటీ అని వినిపించింది. బట్ ఇప్పుడు మాన్ సూన్ స్టార్టింగ్ లో వస్తారు అనే టాక్ వస్తోంది. జూన్ 20న కుబేరను విడుదల చేస్తారు అంటున్నారు. మరి ఇదైనా పక్కా డేటా లేక మళ్లీ మారుతుందా అనేది తెలియదు కానీ.. ఆ డేట్ కు అంతా స్కూల్స్, కాలేజెస్ అంటూ హడావిడీగా ఉంటారు. అయినా శేఖర్ సినిమా అంటే ఆరంభంలోనే బంక్ కొట్టేస్తారేమో.
ఇక సునిల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com