Trisha : ఏంటి.. ఆవిడా ప్రెగ్నెంటా..?

Trisha :  ఏంటి.. ఆవిడా ప్రెగ్నెంటా..?
X

ఇదుగో పులి అంటే అదుగో తోక అనే చందంగా ఉన్నాయీ మధ్య వార్తలు. ఎవరు గురించి ఏం మాట్లాడుతున్నారో అర్థం తెలియకుండా ఉంది. ఈ మధ్య కాలంలో వస్తోన్న వార్తలైతే అన్నీ అలాగే ఉన్నాయి. ఆ రకంగా చూస్తే ఆవిడ ప్రెగ్నెంట్ అనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఆవిడ ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాతే మరో ఆవిడ విడాకుల వరకు వెళ్లింది.. అనే న్యూస్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆవిడెవరు.. ఈవెడవరు అంటే.. వెరీ సింపుల్ త్రిష, సంగీత సొర్ణలింగం. ఆమె ప్రెగ్నెన్సీకి కారణం విజయ్ అంటున్నారు.

కొన్నాళ్లుగా విజయ్, త్రిషల మధ్య లివ్ ఇన్ రిలేషన్ నడుస్తోంది అనే టాక్ స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఆ కారణంగా సంగీత భర్తపై విడాకుల కేస్ వేసింది. ఆ ఇద్దరికీ విడాకులు గ్యారెంటీ అనిపించింది. ఇన్నాళ్లూ ఇద్దరి మధ్య శాంతియుతంగా చర్చలు సాగాయి. సంగీత అసలు వినకపోవడం వల్లే ఆమె విడాకుల కేస్ వేసింది అనేది అందరికీ తెలిసిందే. ఇక విడాకులు వ్యవహారం బయటకు వచ్చిన మరుక్షణమే విజయ్, త్రిష ఇద్దరూ ఓపెన్ అయిపోయారు. ఓ ఫంక్షన్ కు ఇద్దరూ కలిసి అటెండ్ అయిన విధానం చూశాక ఇక ఇవన్నీ రూమర్స్ కాదు అన్న విషయం తేలిపోయింది.

ఇలాంటి టైమ్ లో సడెన్ గా ఆవిడ ప్రెగ్నెంట్ అనే మాట బయటకు వినిపించడం మాత్రం ఆ రూమర్స్ కూడా నిజమే అనేలా ఉన్నాయి. అయితే త్రిష పై ప్రెగ్నెంట్ అనేవి మాత్రం కేవలం రూమర్స్ మాత్రమే అనేది కూడా తెలుస్తోంది. క్యాజువల్ గానే ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి అంటున్నారు. మొత్తంగా ఈ ఇద్దరూ ఇక ఓపెన్ అయిన తర్వాత ఇలాంటి రూమర్స్ కూడా కామన్ అనే తెలుసు. కానీ నిజంగా ఆమె ప్రెగ్నెంటా కాదా అనేది తెలియాల్సి ఉంది.

Tags

Next Story