Adivi Sesh : అడివి శేష్ కొత్త హీరోయిన్ తనేనా..?

మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ నుంచి రెండేళ్లుగా కొత్త సినిమా రాలేదు 2022లో విడుదలైన హిట్ 2 చివరిది. ఈ రెండేళ్లలో ఏం చేశాడు అనేది పక్కన పెడితే 2025లో రెండు సినిమాలు విడుదల చేయబోతున్నాడు. అందులో మొదటిది డెకాయిట్. షనిల్ డియో డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి కూడా కథ అందించింది శేష్ నే. ఈ మూవీ నుంచి ఓ పోస్టర్ విడుదల చేసింది టీమ్. ఆ పోస్టర్ లో హీరోయిన్ ఫేస్ ను రివీల్ చేయలేదు. దీంతో ఆ హీరోయిన్ ఎవరా అని ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు.
నిజానికి డెకాయిట్ లో ముందుగా శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కొంత భాగం చిత్రీకరణ కూడా అయింది. ఆ పోర్షన్ నుంచే ఓ టీజర్ విడుదల చేసి అందరి అటెన్షన్ సంపాదించాడు శేష్. తన నుంచి మరో ప్రామిసింగ్ మూవీ వస్తుందనుకున్నారు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ బాగా లేట్ అయింది. దీంతో డేట్స్ లేవని శ్రుతి హాసన్ తప్పుకుంది. ఈ కారణంగా ఇంకా లేట్ అయింది సినిమా. అయితే ఆ మధ్య మరో హీరోయిన్ ను తీసుకుని షూటింగ్ స్టార్ట్ చేశారు అని చెప్పారు. ఆమె ఎవరు అనేది రేపు (మంగళవారం) ఉదయం 11.30 గంటలకు రివీల్ చేస్తాం అని ఈ పోస్టర్ విడుదల చేశారు.
బట్ పోస్టర్ చూస్తే ఆ హీరోయిన్ ఎవరు అనేది ఈజీగానే గెస్ చేసేలా ఉందంటున్నారు నెటిజన్స్. సీతారామం, హాయ్ నాన్న మూవీస్ తో మెస్మరైజ్ చేసిన మృణాల్ ఠాకూర్ అనేది మెజారిటీ నెటిజన్స్ ఒపీనియన్. తన కళ్లు చూస్తే ఈజీగా గెస్ చేయొచ్చు. ఆ కళ్ల వల్లే తను మృణాల్ ఠాకూర్ అని డిక్టేర్ చేస్తున్నారు. మరి ఇంత ఈజీ ఫజిల్ ఇచ్చిన టీమ్.. తనెవరో రివీల్ చేయడానికి జస్ట్ పోస్టర్ మాత్రమే వదులుతారా లేక శ్రుతి హాసన్ లాంటి వీడియో వదులుతారా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com