Siddhu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ భయపడుతున్నాడా..?

ఇమేజ్ తెచ్చుకోవడం కాదు.. దాన్ని మోయడం, నిలబెట్టుకోవడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. ఒక ఇమేజ్ రావడానికి చాలా సినిమాలు, చాలాకాలం పడుతుంది. పోవడానికి అంత అవసరం లేదు. ఒకట్రెండు ఫ్లాపులు చాలు. స్టార్ హీరోలు, టాప్ హీరోలు అయితే ఫర్వాలేదు కానీ.. అప్ కమింగ్ హీరోలకు ఇది అత్యంత కష్టమైన పని. అందుకే డిజే టిల్లు, డిజే టిల్లు స్క్వేర్ తో ఓవర్ నైట్ టాలీవుడ్ మొత్తం పాపులర్ అయిపోయాడు. దశాబ్దంగా ఇండస్ట్రీలో ఉన్నా రాని గుర్తింపు ఈ రెండు చిత్రాలతోనే వచ్చింది. దీంతో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు కూడా అతన్ని అప్రిసియేట్ చేశారు. మొన్నటి వరకూ అతన్ని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు పార్టీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇదంతా సినిమాల విజయాలు ఇచ్చే కిక్. అది దిగేందుకు అతనికి ఆట్టే టైమ్ పట్టలేదేమో అనిపిస్తోంది.
రీసెంట్ గా వచ్చిన సిద్ధు జాక్ మూవీ చూసి చాలామందికి మైండ్ పోయింది. అంత పెద్ద దేశ రక్షణ వ్యవస్థను వీళ్లు ఇంత చులకనగా ఎలా చూపించారు అనే ప్రశ్నలు వచ్చాయి. పైగా సిద్ధు ఇంకా డిజే టిల్లు హ్యాంగోవర్ నుంచి బయటకు రాలేదు. అదే ఫ్లేవర్ యాడ్ అవడంతో అప్పుడే మొనాటనీ వచ్చేసింది. కంటెంట్ బాలేదు. కథనం నచ్చలేదు. కామెడీ పండలేదు. జాక్ డిజాస్టర్ అయింది. ఇది ఊహించలేదేమో సిద్ధు షాక్ తిన్నాడు. ఆ డిజాస్టర్ నుంచి బయటకు రాలేకపోతున్నాడట. అందుకే తన నెక్ట్స్ మూవీ ‘తెలుసు కదా’ మూవీ షూటింగ్ పై శ్రద్ధ పెట్టలేకపోతున్నాడట. ఈ కారణంగా సినిమా మరింత లేట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
నీరజా కోన డైరెక్ట్ చేస్తోన్నతెలుసు కదా మూవీలో శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొదలైనప్పుడు బానే ఉంది. బట్ జాక్ తర్వాతే బాధ మొదలైందట. బట్ ఇండస్ట్రీలో ఇవి కామన్. హిట్స్ తో పాటు ఫ్లాపులూ వస్తుంటాయి. కానీ అవుట్ సైడర్స్ కదా.. కాస్త ఇన్ సెక్యూరిటీ ఉంటుంది. అది దాటి తప్పులు తెలుసుకుని మళ్లీ స్టార్ట్ చేస్తే బెటర్. అంతే కానీ.. ఇతర సినిమాలను ఇబ్బంది పెట్టడం సరికాదేమో అనుకుంటున్నారు ఇండస్ట్రీలో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com