Siddhu Jonnalagadda : సిద్ధు మరో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడే

స్టార్ బాయ్ సిద్ధు ఇవాళ బర్త్ డే బాయ్. డిజే టిల్లు రెండు భాగాలతో ఒక్కసారిగా టైర్ 2 హీరోల రేస్ లోకి ఎంటర్ అయిపోయాడు. అతని టైమింగ్ కు ఎంటైర్ టాలీవుడ్ ఫిదా అయిపోయిందనే చెప్పాలి. స్టార్ హీరోలు కూడా సిద్ధు జొన్నలగడ్డ డైలాగ్ డెలివరీని విపరీతంగా ఇష్టపడుతున్నారు. అయితే అతను కథలను బట్టి మాడ్యులేషన్స్ ను సెట్ చేసుకుంటాడు.ఇలా చేసే హీరోలు అరుదు అనే చెప్పాలి. డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ లో డైలాగుల వరద కనిపిస్తుంది. ఇవన్నీ హైదరాబాదీ దక్కన్ స్లాంగ్ లో ఉండటంతో మరింతం అందంగా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జాక్ అనే మూవీతో పాటు నీరజ కోన డైరెక్టర్ గా డెబ్యూ ఇస్తోన్న ‘తెలుసు కదా’మూవీ చేస్తున్నాడు.
ఇవి కాక గతంలో అతను చేసిన కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు. నిజానికి ఇది ఫస్ట్ రిలీజ్ అనే చెప్పాలి. ఎందుకంటే మొదట ఇది కేవలం ఓటిటిల్లో మాత్రమే వచ్చింది. అప్పుడు కోవిడ్ పాండమిక్ కారణంగా ఎక్కువ ఆడియన్స్ కు రీచ్ కాలేదు. అందుకే ఈ వాలెంటైన్స్ డేకు థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. రానా దగ్గుబాటి ప్రెజెంట్ చేసిన సినిమా కాబట్టి ప్రమోషన్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. అయితే థియేటర్ కు రిలీజ్ కు ఈ మూవీకి ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అనే టైటిల్ పెట్టారు. అంటే కృష్ణ అండ్ హిజ్ లీల అనే టైటిల్ థియేటర్స్ కు వర్తించదన్నమాట. అయితే ఈ మూవీని ఆల్రెడీ ఓటిటిల్లో చూసిన వారితో పాటు అప్పటి నుంచి రీల్స్ లోనూ, షార్ట్స్ లోనూ చిన్న కట్స్ లో చూస్తున్నప్పుడు మంచి ‘లవ్ స్టోరీస్’ ఉన్నట్టున్నాయి ఈ మూవీలో అనుకుంటున్నారు. ఇవన్నీ ఫీల్ గుడ్ గానే కనిపిస్తున్నాయి. సో.. చూస్తుంటే ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ కొట్టేలానే ఉన్నాడు అంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com