Tamannaah Bhatia: అతడే నా భర్త.. ఫ్యాన్స్‌కు పరిచయం చేసిన తమన్నా!!

Tamannaah Bhatia: అతడే నా భర్త.. ఫ్యాన్స్‌కు పరిచయం చేసిన తమన్నా!!
Tamannaah Bhatia: తమన్నా భాటియా ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. తాను నటిస్తున్న సినిమాల కంటే తన పెళ్లిపై వస్తున్న రూమర్లే ఎక్కువగా ఉన్నయని ఆమె వాపోతోంది.

Tamannaah Bhatia: తమన్నా భాటియా ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. తాను నటిస్తున్న సినిమాల కంటే తన పెళ్లిపై వస్తున్న రూమర్లే ఎక్కువగా ఉన్నయని ఆమె వాపోతోంది. ఇటీవల ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకోనుందని ఊహాగానాలు వినిపించాయి.


వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు తమన్నా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటోను షేర్ చేసింది. అతడే నా భర్త అని అభిమానులకు పరిచయం చేసింది. వ్యాపారవేత్త అయిన నా భర్తను పరిచయం చేస్తున్నాను..." అనే క్యాప్షన్‌తో పాటు, తానే పురుషుడి దుస్తులు ధరించి ఉన్న వీడియోను షేర్ చేసింది.

అయితే, ఆమె పెళ్లి చేసుకోబోతుంద‌ని పుకార్లు వ్యాపించ‌డం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా ఆమె ఇలాంటి రూమర్స్‌నే ఫేస్ చేసింది. ఒక ఇంటర్వ్యూలో తనకు తగిన వరుడిని కనుగొనే బాధ్యతను తన తల్లిదండ్రులకు అప్పగించినట్లు వెల్లడించింది. తన తల్లి ఇప్పటికే ఆ పనిలో ఉన్నట్లు ఆమె తెలిపింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి నేతృత్వంలోని భోళా శంకర్‌లో అతడికి జోడీగా నటిస్తోంది. నటి కీర్తి సురేష్ అతని సోదరి పాత్రను పోషిస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తు్న్న ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన వేదాళంకు తెలుగు రీమేక్.


ఈ చిత్రం 14 ఏప్రిల్ 2023న వెండి తెరపై విడుదల కానుంది. రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు.

ఓ మలయాళ చిత్రంలో కూడా తమన్నా నటించనుంది. ఇందులో దిలీప్‌ హీరోగా నటిస్తున్నారు. ఫిల్మ్ మేకర్ అరుణ్ గోపీ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ అని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్ర తారాగణంలో డినో మోరియా, శరత్ కుమార్, రాజీవ్ అంకుర్ సింగ్, అమిత్ తివారీ, ఈశ్వరీ రావు, వీటీవీ గణేష్, లీనా, ఆర్యన్ సంతోష్, దారాసింగ్ ఖురానా, కళాభవన్ షాజోన్ మరియు శరత్ సభ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story