Teja Sajja's Mirai : మిరాయ్ కి రిలీజ్ కు ముందే లాభాలా..?

హనుమాన్ తో సూపర్ మేన్ గా మారాడు తేజా సజ్జా. మంచి కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. హడావిడీ లేకుండా ఒక సినిమాకు కాస్త ఎక్కువ టైమ్ పట్టినా ఫర్వాలేదు అన్నట్టుగా సాగుతున్నాడు. అతని లేటెస్ట్ మూవీ మిరాయ్ ఈ సెప్టెంబర్ 12న విడుదల కాబోతోంది. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. తేజా సరసన రితిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈచిత్రంలో మంచు మనోజ్ విలన్ గా కనిపించబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన మిరాయ్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. మిరాయ్ టేబిల్ ప్రాఫిట్స్ తో రిలీజ్ అవుతోందట.
మిరాయ్ చిత్రానికి అయిన బడ్జెట్ 60 కోట్లు అని చెబుతున్నారు. అది కూడా ప్రమోషన్స్ తో కలిపి అని చెబుతుండటం విశేషం. నాన్ థియేట్రికల్ రైట్స్ ను 50 కోట్లకు అమ్మేశారు. తెలుగు థియేట్రికల్ రైట్స్ ను 24.5 కోట్లకు అమ్మేశారు. వాల్డ్ వైడ్ గా 32 కోట్లకు అమ్ముడు అయిపోయిందిట. అంటే ఇప్పటికే 22 కోట్ల లాభంతో కనిపిస్తోంది. కాకపోతే ఈ ఫిగర్స్ నిజమా కాదా అనేది తేలాల్సి ఉంది. నిజమే అయితే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే కొన్నవాళ్లంతా ఫుల్ హ్యాపీస్ అయిపోతారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com