Nithiin Thammudu : తమ్ముడు షాక్ ఇస్తాడా.. సర్ ప్రైజ్ చేస్తాడా

నితిన్ హీరోగా నటించిన సినిమా తమ్ముడు. అతనికి అక్కగా లయ ఈ మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ప్రమోషన్స్ పరంగా కాస్త జోరు పెంచారు. కానీ ఆడియన్స్ వరకూ అవి స్ట్రాంగ్ గా వెళ్లడం లేదు అనేది చాలామంది చెబుతోన్న మాట. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ గతంలో వచ్చిన తమ్ముడు బ్యాంగర్ కంటే గొప్పగా అయితే లేదు. కానీ వీళ్లంతా ఏదో కొత్త ప్రపంచాన్ని సృష్టించారు అనేది మాత్రం తెలుస్తోంది. ఈ కొత్త ప్రపంచపు అనుభూతిని ఆడియన్స్ కూడా ఫీలయ్యేలా చేయగలితే తమ్ముడికి విజయం తథ్యం.
ఈ టైటిల్ అనౌన్స్ అయినప్పుడు ఇదో సెంటిమెంట్ మూవీ అనుకున్నారు. ట్రైలర్స్ వచ్చిన తర్వాత కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. నితిన్ కెరీర్ లో ఇప్పటి వరకూ ఇంత యాక్షన్ చేయలేదు. అలాగే అతని కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది. అయితే ప్రమోషన్స్ తో అంచనాలను భారీగా పెంచడం లేదు వీళ్లు. ఇదో స్ట్రాటజీగానూ భావిస్తున్నారు చాలామంది. ప్రమోషన్స్ వల్ల అంచనాలు పెరుగుతాయి. వాటిని అందుకునేలా సినిమా లేకపోతే ఆడియన్స్ మేకర్స్ కు షాక్ ఇస్తారు. బట్ ఇలా లో ప్రొఫైల్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే మేకర్స్ ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేసినట్టు అనుకోవచ్చు. తమ్ముడు టీమ్ స్ట్రాటజీ చూస్తుంటే సర్ ప్రైజ్ చేసేలానే ఉన్నారు. కాకపోతే సినిమా వస్తే కానీ అసలు విషయం అర్థం కాదు. ఏదేమైనా కొన్నాళ్లుగా నితిన్ వీర ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇది పోతే పెద్ద ఆశ్చర్యం అనిపించదు. అతని స్క్రిప్ట్ సెలక్షన్ అలా ఉందీ మధ్య. ఒకవేళ హిట్ అయితే మాత్రం ఫ్యాన్స్ తో ఆడియన్స్ కూ ఆనందమే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com