పిల్లలకు 'బార్బీ' సినిమా చూపిస్తున్నారా.. తల్లిదండ్రులకు కొన్ని సూచనలు..

పిల్లలకు బార్బీ సినిమా చూపిస్తున్నారా.. తల్లిదండ్రులకు కొన్ని సూచనలు..
బార్బీ సినిమాపై ఉన్న హైప్, సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడానికి దోహదపడింది.

'బార్బీ' సినిమాపై ఉన్న హైప్, సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడానికి దోహదపడింది. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఇది పిల్లల కోసం తీసిన సినిమా కాదని. బార్బీ అనేది పెద్దల కోసం తీసిన వ్యంగ్య చిత్రం. కాబట్టి, మీరు మీ పిల్లలను బార్బీ చూడటానికి తీసుకు వెళ్లాలనుకుంటున్నారా.. ఒకసారి ఆలోచించండి.

బార్బీ చిత్రానికి గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించారు. మార్గోట్ రాబీ దీనిని నిర్మించారు. బార్బీ చిత్రం శుక్రవారం, జూలై 21, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదలైంది.

ఇంతకీ ఈ సినిమా దేనికి సంబంధించినది?

ఇది ఖచ్చితంగా మీరు అనుకునే బార్బీ కంటెంట్ కాదు. ఈ చిత్రం ఆల్-పింక్ బార్బీ ల్యాండ్‌ను ప్రదర్శిస్తుంది. బార్బీ బొమ్మలు సరదాగా కనిపిస్తే, కెన్ రూపొందించిన బొమ్మలకు ప్రాణం ఉండదు.

స్టీరియోటైపికల్ బార్బీ (మార్గాట్ రాబీ పోషించినది) మరియు ఆమె ప్రియుడు కెన్ ( ర్యాన్ గోస్లింగ్ పోషించినది ) బార్బీ ల్యాండ్‌లోని కొన్ని వింత సంఘటనలను పరిశోధించడానికి వెళతారు.

'బార్బీ' సినిమా పిల్లలకు చూపించవచ్చా అంటే కచ్చితంగా వద్దు అనే సమాధానం వస్తుంది. సినిమాలో భాష చిన్న పిల్లలకు అర్థం కాదు. అలాగే వాస్తవ ప్రపంచానికి దగ్గరగా ఉండదు.

కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలతో అన్ని విషయాలు చర్చించడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. వారికి ఆ విషయాలు మాట్లాడడానికి సౌకర్యవంతంగా అనిపించకపోవచ్చు, మరికొందరు తమ బిడ్డ పరిణతి చెందిన విషయాలను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారో లేదో గమనించకపోవచ్చు. కానీ ఈ సినిమాలో అలాంటి విషయాలన్నీ చాలా సాధారణ విషయం అన్నట్లుగా చూపించేస్తారు.

కాస్త పెద్ద పిల్లలకు ఇందులో ఉన్న సందేశం అర్ధమవుతుంది. ఇందులోని హాస్యాన్ని ఆస్వాదిస్తారు. కానీ చిన్న పిల్లలు దానిని అర్థం చేసుకోలేరు.పై విషయాలను దృష్టిలో ఉంచుకుని మీ పిల్లలను బార్బీ సినిమాకు తీసుకువెళ్లాలా లేదా అనేది నిర్ణయించుకోండి.

Tags

Read MoreRead Less
Next Story