Dacoit Movie : డెకాయిట్ గట్టిగా కొట్టబోతోందా..?

Dacoit Movie :  డెకాయిట్ గట్టిగా కొట్టబోతోందా..?
X

అడివి శేష్ హీరోగా నటించిన మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఈ ఇద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉండబోతోంది అనిపించేలా ఉంది. పైగా టైటిల్ కు భిన్నంగా ఇదో లవ్ స్టోరీ అని ముందు నుంచీ చెబుతూ ఉండటం మాత్రం ఏదో తేడా కొడుతుంది. అంటే నెగెటివ్ గా కాదు.. ఇందులో లవ్ స్టోరీకి మించిన ఎలిమెంట్స్ ఇంకేదో ఉండబోతోంది అనేలా ఉంది. శేష్ ఇప్పటి వరకు చేసిన మూవీస్ కు భిన్నంగా ఇది ఉండబోతోంది అనేది మాత్రం క్లియర్. శేష్ మూవీస్ అంటే బలమైన కథ, కథనాలతో రావడం మామూలే. కానీ ఈ సారి డెకాయిట్ లో అంతకు మించి సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి అనిపించేలా ఉంది. మరి అది ఏంటీ అనేది సినిమా చూస్తే కానీ తెలియదు.

షనీల్ డియో డైరెక్ట్ చేసిన మూవీ ఇది. కానీ అతనెవరు అనేది ఇప్పటి వరకు ఎవరూ పెద్దగా తెలియదు. అంతా అడివి శేష్ మాత్రమే చూస్తున్నారు. అతను కూడా దర్శకుడి గురించి ఎక్కడా చెప్పకపోవడం కొంత ఆశ్చర్యం అయినా.. మామూలుగా శేష్ సినిమాకు సంబంధించి అంతా తానే చూసుకుంటుంటాడు. ఇప్పటి వరకు అతను చేసిన మూవీస్ విషయంలో కూడా దర్శకుల గురించి పెద్దగా హైలెట్ అయిన సందర్భాలు కూడా లేవు. డెకాయిట్ లో కూడా అదే కనిపిస్తోంది. సరే అవన్నీ ఎలా ఉన్నా.. అవుట్ పుట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. కటౌట్ కు తగ్గ కథ పడాలి. అది ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేలా ఉండాలి. అది మాత్రమే అతను చూసుకుంటాడు. మిగిలిన విషయాలేం పట్టించుకోడు అనేది అందరికీ తెలిసిందే కదా.

ఇక ఈ మూవీలో అనురాగ్ కశ్యప్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. అతను విలనా లేక పాజిటివ్ పాత్ర చేస్తున్నాడా అనేది మాత్రం తెలియదు. అలాగే పోలీస్ పాత్రలోనే మరో లేడీ జైన్ మేరీ ఖాన్ కనిపించబోతోంది. తను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించిన విధానం మాత్రం హాట్ టాపిక్ అయిపోయింది. అనురాగ్ కులకర్ణి, ప్రకాష్ రాజ్, సునిల్ కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. మరి ఈ మూవీతో శేష్ మరో భారీ విజయాన్ని కూడా అందుకుంటాడా అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

Tags

Next Story