Kodama Simham Re Release : కొదమ సింహం రీ రిలీజ్ టైమ్ కరెక్టేనా..?

Kodama Simham Re Release :  కొదమ సింహం రీ రిలీజ్ టైమ్ కరెక్టేనా..?
X

కొదమసింహం .. చిరంజీవి మెగాస్టార్ గా మారుతున్న టైమ్ లో విడుదలైన మూవీ. 1990 ఆగస్ట్ 9న విడుదలైన ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. కే మురళీ మోహన్ రావు డైరెక్ట్ చేసిన సినిమా ఇది. మెగాస్టార్ చిరంజీవితో పాటు రాధ, సోనమ్ హీరోయిన్లుగా నటించారు. మోహన్ బాబు, ప్రాణ్, సత్యనారాయణ, టైగర్ ప్రభాకర్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు అయితే సడెన్ గా ఈ మూవీని 4కే టెక్నాలజీకి అప్డేట్ చేశారు. సడెన్ గా ఈ మూవీని ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు అనే వార్తలు వచ్చిన తర్వాత మాత్రం చాలామంది ఆశ్చర్యపోతున్నారు. చిరంజీవి ఇంతకు మించిన పెద్ద విజయాలు కూడా సొంతం చేసి ఉన్నాడు. సడెన్ గా కొదమ సింహం మాత్రం రీ రిలీజ్ చేయబోతున్నారేంటా అని సర్ ప్రైజ్ అవుతున్నారు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత మనవాళ్లు మాత్రం ఫిదా అయిపోయారు. మెగాస్టార్ ను ఆ లుక్ లో చూసి ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు.

అయితే కొదమ సింహం రీ రిలీజ్ డేట్ మాత్రం మెప్పిస్తుందా అనే ఆలోచనలో కూడా పడిపోయారు. ఈ 21న చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ గా మాత్రం ఏకంగా 7 సినిమాలు విడుదల కాబోతున్నాయి. అలాగే మరో మూడు డబ్బింగ్ మూవీస్ కూడా విడుదలవుతున్నాయి. ఈ టైమ్ లో కొదమ సింహం రీ రిలీజ్ ఏ మాత్రం సమంజసంగా లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఓ లెజెండరీ మూవీ అనేది ఇన్నేసి చిత్రాలతో పాటు విడుదల చేయడం పెద్దగా నచ్చలేదు. మరోవైపు చిరంజీవి అండ్ టీమ్ కూడా మూవీ గురించి పెద్దగా మాట్లాడ్డం లేకపోవడం కూడా కొంత మైనస్ గా మారింది. చూస్తుంటే కొదమ సింహం మాత్రం ఇన్నేసి చిత్రాల మధ్య ఆడియన్స్ ముందుకు వస్తుండటం మాత్రం నచ్చడం.. అన్నేసి చిత్రాల మధ్యే విడుదల కావడం కూడా నచ్చకపోవడం కూడా జరగడం అనేసి చెప్పాలి.

Tags

Next Story