Vidudala 2 : విడుదల 2 రన్ టైమ్ ఇక్కడ వర్కవుట్ అవుతుందా..?

Vidudala 2 :  విడుదల 2 రన్ టైమ్ ఇక్కడ వర్కవుట్ అవుతుందా..?
X

ఒకప్పుడు రన్ టైమ్ సినిమాల రిజల్ట్స్ పై ప్రభావం చూపించేది. అంటే రెండు మూడు దశాబ్దాల క్రితం వరకు. బట్ రీసెంట్ టైమ్స్ లో కంటెంట్ లో దమ్ముంటే అదేం ప్రాబ్లమ్ కాదని ప్రూవ్ అవుతోంది. అదే టైమ్ లో కంటెంట్ ఏ మాత్రం వీక్ అయినా రన్ టైమే పెద్ద మైనస్ అవుతుంది. అందుకే రన్ టైమ్ అనేది కథనంలో ఎంత దమ్ముంది అనేదాని బట్టి ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న పుష్ప 2 ఏకంగా 3.20 గంటలు ఉంది. బలమైన కంటెంట్ కాకపోయినా ఆ మాస్ సీక్వెన్స్ ల వల్ల ఆడియన్స్ భరించారు అనే చెప్పాలి. కాకపోతే ఇది ఇతర భాషా చిత్రాలకు ఇంత ఎక్స్ క్యూజ్ ఉండదు. అందుకే విడుదల 2 రన్ టైమ్ పై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

విజయ్ సేతుపతి, మంజువారియర్, సూరి, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన విడుదల 2 ఈ నెల 20న విడుదల కాబోతోంది. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కు అద్బుతమైన అప్లాజ్ వచ్చింది. అందుకే సెకండ్ పార్ట్ పై కొంత ఆసక్తిగా ఉన్నారు ఆడియన్స్. కాకపోతే ఒక వర్గం ప్రేక్షకులకు ఇది పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. ఆ కారణంగా రన్ టైమ్ నెగిటివ్ అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఇంతకీ ఈ సినిమా నిడివి ఎంతంటే.. 2 గంటల 52 నిమిషాలు. అంటే ఆల్మోస్ట్ మూడు గంటలు. మూడు గంటల పాటు ప్రేక్షకులను కూర్చోబెట్టాలంటే అవుట్ స్టాండింగ్ అనిపించే కంటెంట్ ఉండాలి. ట్రైలర్ చూస్తే మోస్ట్ ప్రామిసింగ్ అనిపించుకుంది. ఆర్టిస్టులు మెయిన్ ఎసెట్ అవుతున్నారు. మరి ఈ రన్ టైమ్ తెలుగులో వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

Tags

Next Story