Samantha: సమంతకు ఏమైంది.. ఎక్కడ ఉంది?

Samantha: వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా ఎంతో నిబ్బరంగా వ్యవహరించింది. తనదే తప్పంతా అన్నట్లు ట్రోల్ చేసినా నోళ్లు మూయించలేకపోయింది. పనితోనే సమాధానం చెబుతానని వరుస సినిమాల్లో నటిస్తూ తనని తాను బిజీగా మార్చుకుంది. కానీ ఈ మధ్య ఎందుకో సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత గురించి మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి.
సమంతకు ఏమైంది.. ఎందుకు ఒక్క పోస్ట్ కూడా పెట్టట్లేదు.. ఆరోగ్యం బాగాలేదా ఏంటి అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తాను పూర్తి చేసిన సినిమాలు మూడు పెండింగ్‌లో ఉన్నాయి. శాకుంతలం, యశోద, విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి. ఈ మూడు చిత్రాలు విడుదల కావలసి ఉంది.
శాకుంతలం మోషన్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ నవంబర్ 4న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక యశోద, ఖుషీకి సంబంధించిన డేట్లు రావలసి ఉంది. ఖుషీ సినిమా కూడా ఇంకా మొత్తం పూర్తి కాలేదని తెలుస్తోంది. ఆ మధ్య కొన్ని వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి.
ఆమెకు స్కిన్ డిసీజ్ వచ్చిందని, ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్లిందని అన్నారు. అయితే ఆమె మేనజర్ మాత్రం సమంతకు ఏంకాలేదు. త్వరలో షూటింగ్స్‌లో పాల్గొంటుందని ఆయన తెలిపారు. దాంతో అభిమానులు తమ ఊహాగానాలకు చెక్ పెట్టారు. ఏది ఏమైనా సమంత తనకు తానుగా పోస్ట్ పెట్టేంత వరకు ఆమె గురించి మాట్లాడుకోకుండా ఉండలేరు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com