Balayaa - NTR : ఎన్టీఆర్ - బాలయ్య ఒక్కటే.. నా..?
కొన్నాళ్లుగా నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ను దూరం పెట్టిందనే వార్తలు చూస్తున్నాం. ఈ మేరకు ఫ్యామిలీ ఫంక్షన్స్ కు కూడా ఆహ్వానం అందడం లేదు. ముఖ్యంగా బాలకృష్ణ అయితే ఎన్టీఆర్ పేరు చెబితేనే సీరియస్ అవుతున్నాడు అనే వారూ ఉన్నారు. ఈ నెలలో బాలయ్య 50యేళ్ల సినీ ప్రస్థానం సభకు కూడా ఎన్టీఆర్ కు ఇన్విటేషన్ లేదు. ఇవన్నీ ఓ ఎత్తైతే.. ఎన్టీఆర్ సైతం ఆ కుటుంబానికి సంబంధించిన ఫంక్షన్స్ కు డుమ్మా కొడుతున్నాడు. సో.. ఫ్యామిలీతో ఎలా ఉన్నా.. బాలయ్యకు ఎన్టీఆర్ కు మధ్య మళ్లీ చాలా పెద్ద గ్యాప్ వచ్చిందనేది నిజమే అంటారు చాలామంది. బట్ సిట్యుయేషన్ ను కాస్త క్లియర్ గా చూస్తే అంతా అనుకునేంత గ్యాప్ అయితే లేదు. అందుకు నిదర్శనం విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ.
ఈ ఇద్దరు హీరోలను బట్టి వారి మధ్య గ్యాప్ లేదని ఎలా చెబుతారు అనుకుంటున్నారు కదా.? యస్.. టాలీవుడ్ లోనే కాదు.. ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కొన్ని క్యాంప్ లు ఉంటాయి. ఆ క్యాంప్ లకు చెందిన వాళ్లు మరో క్యాంప్ తో అంత స్ట్రాంగ్ బాండింగ్ మెయిన్టేన్ చేయరు. ఇక బాలయ్యతో సిద్ధు, విశ్వక్ ఇద్దరూ బాగా క్లోజ్ గానే ఉంటారు. ఆయన హోస్టింగ్ చేసిన అన్ స్టాపబుల్ కు సైతం వెళ్లారు. చాలా గౌరవిస్తారు. తాజాగా తమ ఫ్లడ్ ఫండ్ ను అందించేందుకు ఏపికి బాలయ్యతో కలిసే వెళ్లారీ యంగ్ హీరోలు. అయితే ఏంటీ అనే కదా డౌట్.
ఇదే హీరోలు ఇటు ఎన్టీఆర్ తో సైతం అదే స్ట్రాంగ్ బాండింగ్ మెయిన్టేన్ చేస్తుంటారు. నిజానికి బాలయ్య వ్యక్తిత్వం తెలిసిన ఎవరైనా తనకు నచ్చని వారితో తిరిగే వారిని దగ్గరకు రానివ్వడు. ఒకవేళ ప్రొఫెషనల్ రిలేషన్ మెయిన్టేన్ చేసినా.. ఈ హీరోలంత క్లోజ్ గా మాత్రం రానివ్వడు. ఈ హీరోలు ఇటు ఎన్టీఆర్ తో ఎంత క్లోజ్ గా ఉంటారో.. బాలయ్యతోనూ అంతే క్లోజ్ గా ఉంటున్నారు. అంటే బాలయ్యకు ఈ యంగ్ స్టర్స్ గురించి తెలియదు అనుకోలేం కదా. అదీ కాక.. మొన్న మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా తమ్ముడికి శుభాకాంక్షలు, అరంగేట్రానికి అభినందనలూ తెలుపుతూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కూడా వైరల్ గా మారింది. ఈ మొత్తం చూస్తే.. బాలయ్యకు ఎన్టీఆర్ పై అంతా అనుకుంటున్నంత కోపం అయితే లేదు అనే అనుకోవాలి. లేదంటే.. విశ్వక్, సిద్ధులను దగ్గరకు కూడా రానివ్వడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com