Dacoit Movie : డెకాయిట్ తో పోటీ పడే సత్తా ఉందా..?

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ డెకాయిట్. ఈ నెల 10న విడుదల కాబోతోందీ మూవీ. సినిమాపై మరీ పెద్దగా అంచనాలు లేవు. కాకపోతే అడివి శేష్ మూవీ కాబట్టి హోప్స్ బలంగానే ఉంటాయి. అది కూడా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కాబట్టి కాస్త అంచనాలు కూడా ఉంటాయి. ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా ఏప్రిల్ 10న విడుదలవుతున్న మూవీస్ తెలుగులో ఏం లేవు. అది పెద్ద ప్లస్ పాయింట్. అయినా రెండు డబ్బింగ్ సినిమాలతో ఇబ్బంది తప్పదు అనిపించేలా ఉంది డెకాయిట్. అఫ్ కోర్స్ డెకాయిట్ కు ఫస్ట్ ఛాన్స్ ఉంది. బట్ కంటెంట్ బావుంటేనే సెట్ అవుతుంది. అది కాకుండా డబ్బింగ్ మూవీస్ దే పై చేయి అయితే తేడా కొడుతుంది. మరి ఆ డబ్బింగ్ మూవీస్ ఏంటీ అంటే..?
తమిళ్ నుంచి వస్తోన్న మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK). ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన మూవీ ఇది. ఈ చిత్రం గతేడాది సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ చాలా కారణాల వల్ల ఆలస్యం అయింది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తూ నిర్మించిన మూవీ ఇది. ట్రైలర్ బావుంది. 2024స్ లో సాగే కథ అని ట్రైలర్ తోనే అర్థం అయింది. కాకపోతే ఈ మూవీపై తెలుగుతో పాటు తమిళ్ లో కూడా అంచనాలు లేవు. అడ్వాన్స్ బుకింగ్స్ లో దారుణంగా కనిపిస్తోంది. ప్రదీప్ ఇప్పటికే తెలుగులో కూడా హ్యాట్రిక్ కొట్టాడు. అలాంటి హీరో నుంచి ఇలా అవడం బాక్సాఫీస్ ను కూడా ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ మూవీకి ఓపెనింగ్స్ లేవు అంటే పెద్ద మైనస్ గా మారబోతోంది.
ఇక మళయాలం నుంచి వస్తోన్న మూవీ పళ్లి చట్టంబి. ఈ టైటిల్ లోనే పెద్ద లోపం ఉంది. కథకు తగ్గట్టుగా టైటిల్ అలానే ఉంచారు అన్నా.. కనీసం తెలుగులో అయినా ఏదైనా టైటిల్ పెడితే బావుండేది కదా అని చాలామంది చెబుతున్నారు. అయినా వాళ్లు ఆ టైటిల్ కే ఫిక్స్ అయ్యారు. పళ్లి అంటే చర్చ్, చట్టంబి అంటే రౌడీ. ఓ చర్చ్ చుట్టూ సాగే కథనంగా ఉండబోతోంది. ఓ రౌడీ ఆ చర్చ్ ను కాపాడే బాధ్యత తీసుకుంటాడు. మరి తర్వాతేమైందీ అనేది పాయింట్. మరి ఈ పాయింట్ తెలుగులో వర్కవుట్ అవుతుందా అంటే పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. బట్ కంటెంట్ లో దమ్ముంటే అవన్నీ పట్టించుకోరు తెలుగు ఆడియన్స్. మరి ఆ కంటెంట్ లో విషయం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. పైగా ఇదో పీరియాడికల్ మూవీ కూడా. 1930ల నేపథ్యంలో సాగే సినిమా.
మొత్తంగా ఈ నెల 10న విడుదల కాబోతోన్న మూడు సినిమాలు కూడా డిఫరెంట్ జానర్స్ లో ఉన్నాయి. కథా కాలం కూడా వేర్వేరుగా ఉన్నాయి. పళ్లి చట్టంబి 1930ల కాలంలో సాగే కథ. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ 20240ల కాలంలో సాగే కథ. డెకాయిట్ ఈ టైమ్ లో ఉండబోతోన్న మూవీ. మరి ఈ మూడు సినిమాల్లో డెకాయిట్ కే ఎక్కువ స్కోప్ ఉంటుందని వేరే చెప్పక్కర్లదేమో.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
