Dhanush : ఇది సరిపోతుందా.. రాయన్ ..

Dhanush : ఇది సరిపోతుందా.. రాయన్  ..
X

ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ రాయన్. ఈ శుక్రవారం విడుదల కాబోతోన్న ఈ మూవీ అతని కెరీర్ లో 50వ సినిమా. ధనుష్ తో పాటు ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, సెల్వ రాఘవన్, ఎస్.జే సూర్య, అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటించారు. ఆ మధ్య వచ్చిన ట్రైలర్ చూస్తే ఇదో రివెంజ్ డ్రామాలా ఉంది. కానీ ఆ రివెంజ్ కారణం ఏంటనేది సినిమాలోనే చూడాలి. దర్శకుడుగా ధనుష్ కు ఆల్రెడీ మంచి మార్కులే ఉన్నాయి. పైగా ఇదో మైల్ స్టోన్ లాంటి సినిమా. అందుకే రాయన్ పై అంచనాలున్నాయి. అయితే ఆ అంచనాలను పెంచాల్సిన విషయంలో మూవీ టీమ్ ఫెయిల్అయిందనే చెప్పాలి. ఏదో ధనుష్ ను ఎక్కవగా అభిమానించేవారికి తప్ప ఈ మూవీ రిలీజ్ అవుతుందన్న విషయం కామన్ ఆడియన్స్ కు పెద్దగా తెలియదు అనే చెప్పాలి. తెలుగులో ప్రమోషన్స్ అంత పూర్ గా ఉన్నాయి. రీసెంట్ గా ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. అంతే. అది కూడా తూతూ మంత్రం అన్నట్టుగానే సాగింది. ఒక ఇంటర్వ్యూ లేదు. మీడియాతో ఇంటరాక్షన్ లేదు. కనీసం ఫ్యాన్ మీట్స్ కూడా లేవు. మరి తెలుగు ఆడియన్స్ కు ఇది చాల్లే అనుకున్నారా లేక రిజల్ట్ ముందే అర్థమై.. అనవసరపు ఖర్చు ఎందుకులే అనుకున్నారా అనేది చెప్పలేం కానీ.. రాయన్.. ఇది సరిపోదు రాయన్.

Tags

Next Story